Advertisementt

గేమ్ ఛేంజర్ : ఇదేం ట్విస్ట్ బాబోయ్

Mon 26th Aug 2024 03:03 PM
game changer  గేమ్ ఛేంజర్ : ఇదేం ట్విస్ట్ బాబోయ్
There Is A Twist In Game Changer Release గేమ్ ఛేంజర్ : ఇదేం ట్విస్ట్ బాబోయ్
Advertisement
Ads by CJ

గేమ్ ఛేంజర్ షూటింగ్ కి అంతు పొంతూ లేదా.. రామ్ చరణ్ ఎప్పుడో తన పాత్ర షూటింగ్ కంప్లీట్ చేసేసాను అనగానే హమ్మయ్య గత మూడేళ్ళుగా సాగదీస్తున్న గేమ్ ఛేంజర్ షూటింగ్ ఫినిష్ అయ్యింది ఇకపై దర్శకుడు శంకర్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ లాక్ చేస్తారని మెగా ఫ్యాన్స్ ముచ్చటపడ్డారు. దిల్ రాజు కూడా పదే పదే గేమ్ ఛేంజర్ డిసెంబర్ అంటూ ఊరిస్తున్నారు.

అయితే ఇప్పుడు గేమ్ చెంజర్ రీ షూట్స్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇండియన్ 2 రిజల్ట్ తర్వాత శంకర్‌ లో అతి జాగ్రత్త మొదలయ్యింది, అందుకే గేమ్ ఛేంజర్ లోని కొన్ని సన్నివేశాల విషయంలో ఆయన సంతృప్తికరంగా లేరని.. మళ్లీ వాటిని చిత్రీకరించాలని అంటుకుంటున్నట్లుగా తెలుస్తుంది..

సినిమా రిలీజ్ అయ్యాక బాధపడేకన్నా ముందే తప్పులు దిద్దుకోవడం మంచిదని శంకర్ భావిస్తున్నట్లుగా గుసగుసలు మొదలయ్యాయి. రిలీజ్ డేట్ ఇస్తారనుకుంటున్న సమయంలో గేమ్ ఛేంజర్ పై ఇలాంటి వార్తలు చూసి ఇదేం ట్విస్ట్ రా నాయనా అని మెగా అభిమానులు కూడా తలకొట్టుకుంటున్నారు. 

There Is A Twist In Game Changer Release :

  Mega fans are Waiting For release date of game changer 

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ