Advertisementt

దర్శన్ కేసులో సస్పెండ్ అయిన పోలీసులు

Mon 26th Aug 2024 12:12 PM
darshan  దర్శన్ కేసులో సస్పెండ్ అయిన పోలీసులు
Darshan VVIP Treatment in Jail దర్శన్ కేసులో సస్పెండ్ అయిన పోలీసులు
Advertisement
Ads by CJ

కన్నడ హీరో దర్శన్.. ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ, దర్శన్ అభిమానిని హత్య చేయించిన కేసులో ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీలో రేణు స్వామి అనే అభిమానిని దర్శన్ కిరాయి గుండాలతో అత్యంత పాశవికంగా చంపించిన ఘటన పెను సంచనం సృష్టించింది.

ప్రస్తుతం దర్శన్ తో పాటుగా ఆయన ప్రియురాలు పవిత్ర గౌడ ఇంకా 14మంది ఈకేసులో నిందుతులుగా జైలు ఊచలు లెక్కబెడుతుండగా.. దర్శన్ కి పరప్పర జైలులో రాచమర్యాదలు జరుగుతున్నాయనే వార్త ఎప్పటి నుంచో వినిపిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడడమే కాకుండా రీసెంట్ గా దర్శన్ ఓ వీడియో కాల్ మాట్లాడినట్లుగా తెలుస్తుంది.

బెంగళూరు జైల్లోనే ఉన్న ధర్మ అనే గ్యాంగ్‌స్టర్‌తో.. దర్శన్‌ వాట్సాప్‌ వీడియోకాల్‌ మాట్లాడినట్లుగా, దానికి సంబందించిన వీడియో బయటకు రావడంతో ఉలిక్కిపడిన జైలు అధికారులు.

దర్శన్ ఉన్న జైల్లో ఓ వెలుతురు ఉన్న ఆ గదిలో తన స్నేహితులతో కొంతసేపు వీడియో కాల్ మాట్లాడిన ఘటన కన్నడ మీడియాలో సంచలంగా మారగా.. దర్శన్ తీరు ఇప్పుడు జైలు అధికారులకు, పోలీసులకు తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంపై కర్నాటక ప్రభుత్వం సీరియస్‌ అవడమే కాకుండా ఏడుగురు జైలుఅధికారులపై కర్నాటక ప్రభుత్వం.. వేటువేసింది. 

జైల్లో కూడా దర్శన్‌ రాచమర్యాదలు అందుకోవడం నిజంగా విశేషమే. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో పై నెటిజన్లు మండిపడుతున్నారు.

Darshan VVIP Treatment in Jail:

7 Prison Officials Suspended Over VIP Treatment For  Darshan In jail

Tags:   DARSHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ