Advertisementt

అయ్యా దేవర ఇంకా నెల మాత్రమే ఉంది!!

Mon 26th Aug 2024 10:46 AM
devara  అయ్యా దేవర ఇంకా నెల మాత్రమే ఉంది!!
Oh Devara, only a month left!! అయ్యా దేవర ఇంకా నెల మాత్రమే ఉంది!!
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ గా మారిన తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ప్రాజెక్ట్స్ పై పాన్ ఇండియా ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీ కనిపిస్తుంది. ఆయన నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర షూటింగ్ పూర్తి చేసి ఇతర ప్రాజెక్ట్స్ పైకి వెళ్లిపోతున్నారు. కొరటాల శివ పోస్ట్ ప్రొడక్షన్ తో కిందా మీదా పడుతున్నారు. 

ఎన్టీఆర్ అభిమానుల్లో మాత్రం ఆందోళన మొదలైపోయింది. పాన్ ఇండియా మూవీ.. ప్రమోషన్స్ ఏవి అంటూ మధనపడుతున్నారు. కేవలం రెండు పాటలు, ఇంకా ఫస్ట్ లుక్స్ తప్ప ఇప్పటివరకు దేవర ని హై లో ఉంచే కంటెంట్ రాలేదు, నార్త్ ఆడియన్స్ లో దేవర బలం ఏమిటో తెలియడం లేదు. ఇప్పటివరకు వచ్చిన దేవర అప్ డేట్స్ నార్త్ లో ఎక్కడివరకు రీచ్ అయ్యాయో తెలియదు. 

హిందీ యాక్టర్స్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఉంటే సరిపోదు, అక్కడ భీభత్సమైన అంచనాలు దేవర పై రావాలి. అప్పుడే నార్త్ ఆడియన్స్ లో దేవర పై క్రేజ్ పెరుగుతుంది. కానీ కొరటాల-ఎన్టీఆర్, దేవర మేకర్స్ ఎవరూ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు, ప్రమోషన్స్ విషయంలో కొత్తగా ప్లాన్ చెయ్యమని దేవర టీం కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు. 

సెప్టెంబర్ 27 దేవర విడుదలకు డేట్ ఫిక్స్ అయ్యింది. ఈలోపులో దేవర టీమ్ సినిమాపై మరింతగా అంచనాలు పెంచే కంటెంట్ వదలాలి అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరిక. 

Oh Devara, only a month left!!:

Devara: Part 1 Released On September 27

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ