బాలీవుడ్ లో స్త్రీ 2 బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది. శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్త్రీ 2 చిత్రం విడుదలైన మరుక్షణం నుంచి సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీసు జాతర మొదలు పెట్టింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ లో 200 కోట్లు కొల్లగొట్టి అందరికి షాకిచ్చింది.
ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మిస్తే ఇప్పుడు ఈ చిత్రం పది రోజులు తిరిగేసరికి 500కోట్లు క్లబ్బులో అఫీషియల్ గా అడుగుపెట్టడానికి సిద్ధమైంది. ఈ వీకెండ్ లోను స్త్రీ 2 బాక్సాఫీసు వసూళ్లు అద్భుతంగా ఉన్నాయి. మెయిన్ సిటీస్ లో 60 నుండి 80 పర్సెంట్ అక్యుపెన్సీతో థియేటర్స్ కనిపించాయి.
ఇండియా, ఓవర్సీస్ అన్ని చోట్లా స్త్రీ 2 హావ నడుస్తుంది. బాలీవుడ్ నుంచి సౌత్ వరకు ఇలా విడుదలైన ఏ భాషలో అయినా స్త్రీ 2 అదిరిపోయే కలక్షన్స్ తో దూసుకుపోతుంది. శ్రద్ద దాస్ యాక్టింగ్, మేకింగ్, పోస్ట్ హరర్, థ్రిల్లర్, సస్పెన్స్ ఎలిమెంట్స్, తమన్నా స్పెషల్ సాంగ్ అన్ని స్త్రీ 2 కి హెల్ప్ అయ్యాయి.