ఎక్కువగా పవన్ పక్కన, ఆయన సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించే కమెడియన్ అలీ కొన్నాళ్లుగా అంటే ఆయన వైసీపి పార్టీలో చేరి పవన్ కళ్యాణ్ పై చేసిన కామెంట్స్ వలన పవన్ కళ్యాణ్ సినిమాల్లో అవకాశాలు కోల్పోయిన అలీ.. ఏపీలో వైసీపీ దారుణంగా ఓడిపోయాక అలీ తాను సినిమాల్లో మళ్ళీ సినిమాల్లో బిజీ అవ్వాలంటే వైసీపీ కి బై బై చెప్పెయ్యాలని అలీ డిసైడ్ అయ్యాడు.
కేవలం వైసీపీ కే కాదు రాజకీయాలకు కూడా రాం రాం చెప్పేసిన అలీ మళ్ళీ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. అదే విషయాన్ని అలీ తాజాగా హైదరాబాద్ లో జరిగిన సరిపోదా శనివారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బయటపెట్టాడు. తాను దానయ్య నిర్మిస్తున్న పవన్ కళ్యాణ్ OG లో నటిస్తున్నానంటూ కన్ ఫర్మ్ చేసారు.
ఆ ఈవెంట్ లో ఎర్ర కండువాను చూపించి.. దీనికి ఓ స్పెషాల్టీ ఉందని, దీన్ని చూస్తే అందరికీ ఆయనే గుర్తుకు వస్తాడంటూ.. వాళ్లకి ఆ విషయం తెలుసని.. ఆ.. ఆ.. అంటూ పవన్ కళ్యాణ్ స్టైల్లో చెప్పి పవన్ ఫ్యాన్స్ ని అలీ ప్రసన్నం చేసుకుంటున్నాడు. మరి పవన్ OG లో అలీ ఎలాంటి కేరెక్టర్ చేస్తున్నాడు, పవన్ పక్కనే కనిపిస్తాడా అనేది తెలియాల్సి ఉంది.