జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్ పూర్తి చేసేసి వార్ 2 సెట్స్ లోకి అడుగుపెట్టేందుకు సిద్దమైన సమయంలో వార్ 2 షూటింగ్ వాయిదా పడడంతో ఎన్టీఆర్ ఇమ్మిడియట్ గా భార్య ప్రణతి ని తీసుకుని చాలా చిన్నపాటి వెకేషన్ కి వెళ్లిపోయారు. ఆగష్టు మూడో వారంలోనే ఎన్టీఆర్ వార్ 2 సెట్స్ లోకి వెళ్లాల్సి ఉంది.
కానీ వార్ 2కి బ్రేక్ రావడంతో భార్య ని తీసుకుని వెకేషన్ ప్లాన్ చేసుకున్న ఎన్టీఆర్ మళ్ళీ తిరిగి హైదరాబాద్ వచ్చేసారు. ఈరోజు భార్య ప్రణతితో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. చిన్నపాటి వెకేషన్ ని ముగించుకున్న ఎన్టీఆర్ ఇకపై ముంబై కి వెళ్లనున్నారు. వార్ 2 అలాగే ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 షూటింగ్ కి ఎన్టీఆర్ ప్రిపేర్ అవుతారు.
ఆ రెండింటితో పాటుగా మరో నెల రోజుల్లో విడుదల కాబోయే దేవర ప్రమోషన్స్ లోను ఎన్టీఆర్ పాల్గొంటారని తెలుస్తుంది. ఇండియాలోని ప్రధాన నగరాల్లో దేవర ప్రమోషనల్ ఈవెంట్స్ ని కొరటాల ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్.