తమిళనాట స్టాలిన్ ప్రభుత్వానికి ప్రత్యర్థిగా హీరో విజయ్ పార్టీ పెట్టి ఆ పార్టీ లోగోను కూడా ఆవిష్కరించడమే కాకుండా విజయ్ అభిమానులతో, ప్రజలతో మమేకమయ్యేందుకు ఇప్పటి నుంచే మార్గాన్ని వేసుకుంటున్న విషయం తెలిసిందే. తమిళిగా వెట్రి కళగం పార్టీ ని స్థాపించి 2026 ఎన్నికల్లో పోటీ చేసేందుకు విజయ్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నారు.
విజయ్ పార్టీలో కోలీవుడ్ ప్రముఖులెవరైనా జాయిన్ అవుతారా అనే విషయంలో ప్రస్తుతం అందరూ ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు. అదలా ఉంటే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ విజయ్ పార్టీ పై ఇండైరెక్ట్ కామెంట్స్ చెయ్యడమే కాదు.. ప్రస్తుతం ఉన్న తమిళనాట స్టాలిన్ ప్రభుత్వాన్ని ఆయన ఆకాశానికెత్తేశారు.
తమిళ రాజకీయాలపై రజనీకాంత్ ఓ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. డీఎంకే పార్టీ మర్రి చెట్టు లాంటిది, ఎలాంటి తుఫానునైనా ఎదుర్కొంటుంది. డీఎంకే మర్రి చెట్టును ఎవరూ కదిలించలేరు.. అంటూ రజినీకాంత్ ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై హీరో విజయ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
విజయ్ అభిమానులే కాదు కోలీవుడ్ మీడియాలో కూడా విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లో దిగిన వేళ రజనీ కామెంట్స్.. హాట్ టాపిగ్గా మారాయంటూ మాట్లాడుకుంటున్నారు.