పవన్ కళ్యాణ్ vs అల్లు అర్జున్.. వారి మధ్యలో ఈ గొడవ ఎలా ఉందొ తెలియదు, అభిమానుల నడుమ, ఆత్మీయుల నడుమ మాత్రం పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే స్థాయికి చేరుకుంది. అల్లు అర్జున్ నంద్యాల టూర్ వెళ్లడంపై నాగబాబు ఆగ్రహం చూపిస్తే.. పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం పై చేసిన ఇండైరెక్ట్ కామెంట్స్ పై అల్లు మామగారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
రీసెంట్ గా కూడా అల్లు అర్జున్ నాకు నచ్చితే చేస్తాను, నాకు నచ్చితే వస్తాయి అంటూ నంద్యాల వెళ్లడంపై ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు మరోసారి మెగా అభిమానులను ఆగ్రహానికి గురి చేసాయి. అదే సమయంలో అల్లు అర్జున్ భార్య తండ్రి చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం సృష్టించేలా చేస్తున్నాయి.
అల్లు అర్జున్ మామ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోలు ఎర్ర చందనం దుంగలను నరికేస్తూ అటవీసంపద దోచేసే స్మగ్లర్లుగా నటిస్తున్నారని పుష్ప సినిమాను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లను ఆయన తప్పు పట్టారు. అల్లు అర్జున్ కేవలం నటుడిగా స్మగ్లర్‌గా నటించాడు. నిజంగా ఆయన ఆ వ్యాపారం చేస్తే తప్పుపట్టాలి.
అలాంటి సమయంలో పవన్ కల్యాణ్ అర్ధం చేసుకుని నా మాటల వెనుక ఉద్దేశం అది కాదు అని అంటే ఈ వివాదానికి తెర పడుతుంది అని అన్నారు. అంటూ ఆయన పవన్ కళ్యాణ్ కి సలహా ఇచ్చారు. మరి ఈ విషయమై పవన్ ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.