డిప్యూటీ సీఎం తో సినిమా ని పూర్తి చెయ్యాలంటే ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్లి పూర్తి చెయ్యాల్సిందే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాను పూర్తి చెయ్యాల్సిన సినిమాల విషయంలో ఈమధ్యన దర్శకనిర్మాతలు పవన్ ని కలిశారు. హరి హర వీరమల్లు, OG , ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు వెళ్లి పవన్ కళ్యాణ్ పూర్తి చెయ్యల్సిన సినిమాలు, ఆయన డేట్స్ అడిగినట్లుగా తెలుస్తుంది.
పవన్ కూడా అక్టోబర్ నుంచి డేట్స్ ఇచ్చి త్వరగా సినిమాలు పూర్తి చెయ్యాలని చూస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ వాల్యుబుల్ టైమ్ ని ఆయన నిర్మాతలు పర్ఫెక్ట్ గా వాడుకోవాలని భావిస్తున్నారట. OG కు పవన్ చాలా తక్కువ డేట్స్ ఇస్తే సరిపోతుంది. అందుకే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినప్పటికీ హైదరాబాద్ టు అమరావతి అని ఆయన సమయం వృధా కాకుండా OG మేకర్స్ ఓ సెన్సేషనల్ స్టెప్ తీసుకుంటున్నారట.
అదే OG కి సంబందించిన మిగతా షూటింగ్ ని విజయవాడలో చెయ్యాలని, అక్కడే ముంబై బ్యాక్ డ్రాప్ సెట్ వేసి అందులో మిగతా భాగాన్ని చిత్రీకరించాలని సుజిత్, దానయ్య అనుకుంటున్నారట. పవన్ కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అని వారు ఈ డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే పవన్ అక్కడ విజయవాడ అయినా సెప్టెంబర్ లాస్ట్ వీక్ కానీ, లేదంటే అక్టోబర్ మొదట్లో కానీ OG సెట్స్ లో జాయిన్ అవుతారని తెలుస్తుంది.