Advertisementt

ఆ ఫంక్షన్ కన్నా ముందే చిరు-బాలయ్య కలయిక

Sat 24th Aug 2024 10:46 PM
balayya  ఆ ఫంక్షన్ కన్నా ముందే చిరు-బాలయ్య కలయిక
NBK, Chiranjeevi at Ramajogayya sastry son wedding ఆ ఫంక్షన్ కన్నా ముందే చిరు-బాలయ్య కలయిక
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అప్పుడే 50 ఇయర్స్ పూర్తవుతున్నాయి. అందుకే ఇండస్ట్రీ ప్రముఖులు బాలయ్య 50 ఇయర్స్ ఇండస్ట్రీ వేడుకలు సెప్టెంబర్ 1 న ఘనంగా నిర్వహించ తలపెట్టారు. ఈ వేడుకల కోసం మెగాస్టార్ ని ముఖ్య అతిధిగా ఆహ్వానించడానికి కొంతమంది దర్శకులు చిరు ఇంటికి వెళ్లి ఆయన్ని బాలయ్య 50 ఇయర్స్ ఈవెంట్ కి ఆహ్వానించారు. 

మరి బాలయ్య ఈవెంట్ కి మెగాస్టార్ వస్తారా.. అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. వారిద్దరూ కలిస్తే ఆ వేడుకకి పండగ కళ వస్తుంది అని నందమూరి-మెగా అభిమానులు భావిస్తున్నారు. అయితే ఆ ఈవెంట్ కన్నా ముందే చిరు-బాలయ్య కలిసేసారు. అది కూడా హైదరాబాద్ లో జరిగిన ఓ పెళ్ళిలో. 

లిరికిస్ట్ రామజోగయ్య శాస్త్రి గారి కొడుకు పెళ్ళికి బాలకృష్ణ-చిరంజీవి అతిధులుగా హాజరయ్యారు. మెగాస్టార్ చిరు నడుచుకుంటూ పెళ్లి వేదిక దగ్గరకు వెళుతున్న సమయంలో అక్కడే ఉన్న బాలయ్యని పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారగా.. బాలయ్య 50 ఇయర్స్ ఇండస్ట్రీ వేడుకలకన్నా ముందే బాలయ్య-చిరు కలయిక ఇలా అంటూ కామెంట్ చేస్తున్నారు. 

NBK, Chiranjeevi at Ramajogayya sastry son wedding:

Celebrities at amajogaiah Sastry Son Marriage Reception

Tags:   BALAYYA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ