Advertisementt

చిరు సినిమా రిజెక్ట్ చేసిన బేబమ్మ?

Sat 24th Aug 2024 07:38 PM
krithi shetty  చిరు సినిమా రిజెక్ట్ చేసిన బేబమ్మ?
Krithi Shetty who rejected the Megastar film? చిరు సినిమా రిజెక్ట్ చేసిన బేబమ్మ?
Advertisement
Ads by CJ

ఉప్పెన చిత్రంతో బేబమ్మ గా అందరి మనసుకు దగ్గరైన కృతి శెట్టి ఆ తర్వాత టాలీవుడ్ లో వరస ఆఫర్స్ తో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. అవకాశాలు వస్తున్నా ఎలాంటి సినిమాలు చెయ్యాలి, ఏ కథలు సెలెక్ట్ చేసుకోవాలనే విషయంలో కృతి శెట్టికి అనుభవం సరిపోలేదు. మూడు సినిమాలు హిట్ అయితే మరో మూడు నిరాశ పరచడంతో కృతి శెట్టి హావ టాలీవుడ్ లో తగ్గిపోయింది. 

మధ్యలో ఒకటి రెండు చిత్రాలు చేసినా ఆమెకి సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ప్రస్తుతం కోలీవుడ్, మలయాళ హీరోలతో జతకడుతున్న ఈ భామ ఈ మద్యన మెగాస్టార్ మూవీని రిజెక్ట్ చేసింది అనే వార్త వైరల్ గా మారిపోయింది. ఆ విషయమై కృతి శెట్టి క్లారిటీ ఇచ్చింది. తాను మలయాళంలో నటిస్తున్నాను అని, కానీ భాష రాకపోవడం ఇబ్బంది అయినా.. హీరో థొవినో థామస్ బాగా హెల్ప్ చేస్తున్నారని చెప్పింది. 

అంతేకాదు ఇక్కడలా కాకుండా మలయాళంలో వర్కింగ్ టైం ఎక్కువ. అయినప్పటికి అక్కడ యాక్టర్స్ ఎవరూ అలిసిపోరు, చాలా యాక్టీవ్ గా ఉంటారు.. వారిని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇక నేను మెగాస్టార్ సినిమాలో ఆఫర్ రాగా ఆ సినిమాని రిజెక్ట్ చేశాను అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని కృతి శెట్టి కుండబద్దలు కొట్టింది. 

Krithi Shetty who rejected the Megastar film?:

Krithi Shetty Breaks Silence on Rejecting Chiru Film!

Tags:   KRITHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ