హీరో రవితేజకి RT 75 సెట్స్ లో ఓ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో చేతికి గాయమవగా.. రవితేజ దెబ్బ తగిలిన చేతితోనే షూటింగ్ చెయ్యడంతో గాయం తీవ్రత ఎక్కువయ్యింది. దానితో రవితేజ ను హైదరాబాద్ లోని ఓ ప్రవైట్ ఆసుపత్రికి తరలించగా.. రవితేజ చేతికి వైద్యులు శాస్త్రచికిత్స నిర్వహించారు.
ఆపరేషన్ సక్సెస్ అవడంతో పాటుగా ఆయన ఆరు వారాల పాటు పూర్తి గా రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించిన విషయం తెలిసిందే. ఈరోజు రవితేజ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లినట్టుగా రవితేజ ట్వీట్ చేసాడు. సాఫీగా సాగిన సర్జరీ తర్వాత విజయవంతంగా డిశ్చార్జ్ అయ్యాను, మీ అందరి ఆశీర్వాదాలు మరియు మద్దతుకు నా కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసాడు.
భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ తన కెరీర్ లో మైలు రాయిగా నిలిచిపోయే RT 75 చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ లోనే రవితేజ చేతికి గాయమైంది. ప్రస్తుతం రవితేజ అందుబాటులో లేకపోవడంతో షూటింగ్ ని వాయిదా వేసింది చిత్ర బృందం.