Advertisementt

కుమార్తె క్లింకారకు చరణ్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్

Fri 23rd Aug 2024 08:45 PM
ram charan  కుమార్తె క్లింకారకు చరణ్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్
Ram Charan reveals his recent gift to daughter Klin Kaara కుమార్తె క్లింకారకు చరణ్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్
Advertisement
Ads by CJ

రామ్ చరణ్-ఉపాసన తమ కుమార్తె క్లింకార ఫేస్ ని ఇంకా రివీల్ చెయ్యకుండా మెగా అభిమానులను వెయిట్ చేయిస్తున్నారు. మెగాస్టార్ బర్త్ డే కయినా క్లింకార దర్శన భాగ్యం దొరుకుతుందని అనుకుంటే మెగాస్టార్ కూడా మోసం చేసారు. ఇక రామ్ చరణ్ వరల్డ్ లోనే బెస్ట్ ఫాదర్ అంటూ ఈమధ్యనే నిహారిక కొణిదెల చరణ్-క్లింకార బాండింగ్ బయటపెట్టింది. 

తాజాగా రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో తన కుమార్తె క్లింకార కు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ గురించి రివీల్ చేసాడు. రామ్ చరణ్ కు జంతువులంటే వల్లమాలిన ఇష్టం. ఆయన ఫామ్ లో గుర్రాలు, ఏనుగులు ఇలా చాలా రకాల జంతువులు, పక్షులు ఉంటాయి. గుర్రపు స్వారీ లో చరణ్ నెంబర్ 1. మగధీర చిత్రంలో చరణ్ స్వారీ చేసిన గుర్రాన్ని రాజమౌళిని అడిగి తెచ్చేసుకున్నట్లుగా చరణ్ చెప్పాడు. 

నాకు గుర్రాలంటే చాలా ఇష్టం, నేను మగధీర లో స్వారీ చేసిన గుర్రం పేరు బాద్ షా. దానిని నేను రాజమౌళిని అడిగి తెచ్చేసుకున్నాను, ఈమధ్యనే అది బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బుల్లి గుర్రాన్ని నా కూతురు క్లింకార కు గిఫ్ట్ గా ఇచ్చాను. ఈ వయసులోనే క్లింకార ఆ గుర్రాన్ని ఎక్కేందుకు, స్వారీ చేసేందుకు ట్రై చేస్తుంది. 

గుర్రపు స్వారీ విషయంలో నాది, నా కూతురి అభిరుచి ఒకటే కావడం హ్యాపీ గా ఉంది అంటూ చరణ్ తన కూతురు క్లింకార కు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ గురించి ఆ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యాడు. 

Ram Charan reveals his recent gift to daughter Klin Kaara:

Ram Charan reveals about presenting a gift to his daughter Klin Kaara

Tags:   RAM CHARAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ