రవితేజ-హరీష్ శంకర్ ల మిస్టర్ బచ్చన్ ఆగష్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంతో మాస్ మహారాజ్ రవితేజ అభిమానులను, ప్రేక్షకులను మరోసారి డిజ్ పాయింట్ చేసాడు. మిస్టర్ బచ్చన్ రిజల్ట్ తో రవితేజ డల్ అవుతాడనుకున్నారు. కానీ ఆయన ఇమ్మిడియట్ గా కొత్త దర్శకుడు భాను భోగవరపుతో రీసెంట్ గా మొదలు పెట్టిన RT 75 షూటింగ్ కి వెళ్లిపోయారు.
అయితే ఈ RT 75 సినిమా షూటింగ్ లో రవితేజ గాయపడినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ఆయన కుడిచేతికి గాయమవగా.. ఆ గాయంతోనే రవితేజ షూటింగ్ లో పాల్గొనడంతో గాయం తీవ్రత ఎక్కువయినట్లుగా సమాచారం. దానితో యశోద ఆస్పత్రిలో వైద్యులు రవితేజ కుడి చేతికి శస్త్రచికిత్స నిర్వహించినట్లుగా చెబుతున్నారు.
రవితేజ ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. రవితేజ - శ్రీలీల కలయికలో భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్నRT 75 చిత్రానికి కోహినీర్ అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా టాక్ ఉంది.