పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత వరస వైఫల్యాలతో బాగా డిజ్ పాయింటింగ్ మోడ్ లో ఉన్నాడు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల తో పూరి జగన్నాధ్ పనైపోయింది అంటూ మాట్లాడుకుంటున్నారు. టెంపర్, ఇస్మార్ట్ శంకర్ సినిమాల ముందు కూడా ఇలానే మాట్లాడుకున్నారు. కానీ ఆ రెండు చిత్రాలతో పూరి బ్యాక్ బౌన్స్ అయ్యారు.
అయితే లైగర్, డబుల్ ఇస్మార్ట్ దెబ్బలు పూరి ని ఎలా కోలుకునేలా చేస్తాయో తెలియాలి. లైగర్ నష్టాలు డబుల్ ఇస్మార్ట్ తో పూడుద్దామనుకుంటే.. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ నష్టాలను ఎలా పూడ్చాలో అనేది పూరికి పాలుపోవడం లేదు. హనుమాన్ నిర్మాతలే డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ హక్కులు దక్కించుకుని రిలీజ్ చేసారు. హనుమాన్ లాభాలు డబుల్ ఇస్మార్ట్ పట్టుకుపోయింది అని అందరూ మాట్లాడుకుంటున్నారు.
60 కోట్లకు కొంటే 20 కోట్లు వచ్చాయి. దానితో హనుమాన్ మేకర్స్ నిండా మునిగారు. ఇప్పుడు పూరీ నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నిరంజన్ రెడ్డి ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఓ సినిమా చేసేందుకు పూరీ జగన్నాథ్ చర్చలు జరుపుతున్నట్లు టాక్.
అందులో భాగంగా హనుమాన్ హీరో తేజ సజ్జ తో పూరి జగన్నాధ్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడున్న పరిస్థితిలో కొత్త హీరో అయినా పూరి తో సినిమా చెయ్యడానికి అంగీకరిస్తాడా, అలాంటిది తేజ సజ్జ పూరి తో సినిమా ఏం జరుగుతుందో చూద్దాం.