Advertisementt

కిరణ్ అబ్బవరం-రహస్య పెళ్లయ్యిపోయింది

Fri 23rd Aug 2024 11:02 AM
kiran abbavaram  కిరణ్ అబ్బవరం-రహస్య పెళ్లయ్యిపోయింది
Kiran - Rahasya enters into wedlock కిరణ్ అబ్బవరం-రహస్య పెళ్లయ్యిపోయింది
Advertisement
Ads by CJ

రాజావారు-రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం - హీరోయిన్ రహస్య గోరఖ్ లు ప్రేమ వివాహం చేసుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట హైదరాబాద్ లోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల నడుమ నిశ్చితార్ధం చేసుకుంది. ఇక వారం రోజులుగా కిరణ్ అబ్బవరం - రహస్యల పెళ్లి వేడుకలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. 

గత రాత్రి అంటే ఆగష్టు 22 న నైట్ కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్ ల వివాహం కుటంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. కిరణ్ అబ్బవరం పెద్దలు, ఫ్రెండ్స్ సాక్షిగా రహస్య మెడలో తాళి కట్టాడు. రహస్య నేటివ్ ప్లేస్ కర్ణాటక కూర్గ్ లోని ఓ ప్రవేట్ రిసార్ట్ లో కిరణ్ అబ్బవరం, రహస్యల వివాహాన్ని గ్రాండ్ గా జరిపించారు. 

ప్రస్తుతం కిరణ్ అబ్బవరం - రహస్య గోరఖ్ ల పెళ్లి ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ కాగా.. ఈ జంటకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

Kiran - Rahasya enters into wedlock:

Kiran Abbavaram enters into wedlock with Rahasya Gorak

Tags:   KIRAN ABBAVARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ