Advertisementt

పవన్ వెంట పడుతున్న నిర్మాతలు

Fri 23rd Aug 2024 10:22 AM
pawan kalyan  పవన్ వెంట పడుతున్న నిర్మాతలు
Producers following Pawan పవన్ వెంట పడుతున్న నిర్మాతలు
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక కొత్తగా ప్రాజెక్ట్స్ ఏమన్నా ఒప్పుకుంటున్నారేమో అనుకుంటూ కన్ఫ్యూజ్ అవుతున్నారమేమో ఆ టైటిల్ చూసి.. కాదండోయ్.. పవన్ కళ్యాణ్ మధ్యలో వదిలేసిన చిత్రాలను కంప్లీట్ చెయ్యమని అడగడానికి ఆయా సినిమాల నిర్మాతలు వరసగా పవన్ కళ్యాణ్ ని కలుస్తున్నారు. 

అంతేకాదు పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2. సో ఆ రోజున పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల నుంచి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వాలనే విషయంలో పవన్ కళ్యాణ్ పర్మిషన్ కోసం ఆ చిత్ర నిర్మాతలు ఒక్కొక్కరిగా పవన్ ని మీటవుతున్నారు. ఇప్పటికే OG నిర్మాతలకు పవన్ భరోసా ఇచ్చేసారు. అక్టోబర్ నుంచి OG సెట్స్ లో పవన్ జాయిన్ అవుతారని అన్నారు. తాజాగా OG నిర్మాతలు మరోసారి మీటడం హాట్ టాపిక్ అయ్యింది. సుజిత్, దానయ్యలు పవన్ ని కలిసి OG డేట్స్ గురించి చర్చినట్లుగా చెబుతున్నారు. 

తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నిన్న బుధవారం పవన్ కళ్యాణ్ ని మీటయ్యారు. ప‌వ‌న్ డేట్స్ గురించి డిస్క‌ర్షన్ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడు హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు నిర్మాతల వంతు వచ్చింది. ఏఎం రత్నం ఎలాగైనా హరి హర వీరమల్లు పూర్తి చేయాలని చూస్తున్నారు. క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాక ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు జ్యోతి కృష్ణ నిర్వ‌హిస్తున్న విషయం తెలిసిందే. 

పవన్ కళ్యాణ్ కూడా ఓజీతో పాటుగా హరి వీర‌మ‌ల్లు కు సైతం ప‌వ‌న్ కొన్ని డేట్లు కేటాయించిన‌ట్టు స‌మాచారం. సో పవన్ కళ్యాణ్ కోసం ఆయన నిర్మిస్తున్న సినిమాల నిర్మాతలు వెంటబడుతూ డేట్స్ లాక్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. 

Producers following Pawan:

Pawan Kalyan snap with OG makers increases fire

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ