Advertisementt

దువ్వాడను వదిలించుకున్న వైసీపీ

Sat 31st Aug 2024 11:33 AM
ycp party  దువ్వాడను వదిలించుకున్న వైసీపీ
YCP got rid of Duvvada! దువ్వాడను వదిలించుకున్న వైసీపీ
Advertisement

దువ్వాడపై వేటు వేసిన వైసీపీ..

దువ్వాడ శ్రీనివాస్.. వైసీపీ నుంచి ఔట్ అయినట్టేనా..? ఇక పార్టీకి ఆయన సేవలు అక్కర్లేదా..? వద్దు బాబు ఇక మీ సేవలు అని హైకమాండ్ పక్కన పెట్టేసినట్టేనా..? పూర్తిగా దువ్వాడను దొబ్బెసిట్టేనా..? అంటే తాజాగా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రకటనను బట్టి చూస్తే అక్షరాలా నిజమే అనిపిస్తోంది. 

ఇదీ అసలు సంగతి..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన వైసీపీ పోస్టుమార్టం మొదలు పెట్టింది. అసలు పార్టీకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది..? లోపం ఎక్కడుంది..? ప్రజలు ఎందుకు ఇంతలా ఛీ కొట్టి క్రికెట్ టీంకు పరిమితం చేశారు..? ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటి..? ఏయే నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి..? అని మాస్టర్ ప్లాన్ ప్రకారం వెళ్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఒక్కొక్కటీ సెట్ రైట్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఎంతలా హాట్ టాపిక్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఒకే ఒక్క ఎపిసోడ్ తో.. టెక్కలి నియోజకవర్గంలోనే కాదు యావత్ రాష్ట్రంలోనే వైసీపీ గంగలో కలిసినట్టు అయ్యింది. ఇంత జరిగిన తర్వాత కూడా.. ఇంకా పార్టీలో పెట్టుకోవడం, పైగా నియోజకవర్గం ఇంచార్జీగా కంటిన్యూ చేస్తే సభ్య సమాజం ఒప్పుకోదని గ్రహించిన జగన్.. దువ్వాడను పూర్తిగా పక్కన పెట్టారు. 

దువ్వాడ పాయే.. పేరాడ వచ్చే..

టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ స్థానంలో పేరాడ తిలక్‌ను జగన్ రెడ్డి నియమించారు. ఈ మేరకు గురువారం రాత్రి వైసీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఇకపైన టెక్కలి నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ వ్యవహారాలను పేరాడ తిలక్‌ సమన్వయ పరుస్తారని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది పార్టీ. దువ్వాడ ఎమ్మెల్సీ పదవికి కూడా పెద్దగా టైం కూడా లేదు. అందుకే.. ఆయనకు పదవి ఉన్నన్ని రోజులు పార్టీలో ఉండేదుకు మాత్రమే అవకాశం ఉందన్న మాట. అయినా దువ్వాడ వాణి.. దివ్వెల మాధురి ఉండగా పేరాడకు ఇంచార్జీగా నియమించి మంచి పనే చేశారు. ఎందుకంటే వాణికి ఇచ్చి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పోనీ దివ్వెల మాధురి ఇస్తే దువ్వాడకు ఇచ్చినట్టే. ఇదే జరిగితే సీన్ మళ్ళీ మొదటికి వస్తుందని.. గొడవలు కంటిన్యూ అవుతాయని ముందుగా గ్రహించిన జగన్ మంచి నిర్ణయమే తీసుకున్నారు. 

అటు తిరిగి.. ఇటు తిరిగి..

అయినా.. శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసిన తిలక్ ప్రస్తుతానికి టెక్కలి చూసుకుంటారు సరే రేపటి సంగతేంటి..? రానున్న ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసేదెవరు..? మంత్రి అచ్చన్న లాంటి మనిషిని ఢీ కొనాలంటే కేవలం ఆర్థిక, అంగ బలమే కాదు.. మాస్ ఊర మాస్ అయ్యుండాలి.. అది ఇన్నాళ్లు ఉన్న దువ్వాడకే సొంతం. ఇప్పుడు ఆయన్ను తొలిగించారు.. పేరాడ పోటీ చేస్తారా..? అంటే దువ్వాడ అభిమానులు, అనుచరులు.. క్యాడర్ మద్దతు ఉంటుందా..? ఇవన్నీ కాదు సరే పేరాడకు సపోర్టు చేయండని ఒక్కటంటే ఒక్క మాట అయినా దువ్వాడ చెప్పగలరా..? అంటే అస్సలు అది ఊహించలేం..? అందుకే ప్రస్తుతానికి పేరాడను నియోజకవర్గం అప్పగించినా ఎన్నికల సమయానికి.. ఈ లోపు ఇంటి రచ్చ పూర్తి ఐతే మళ్ళీ దువ్వాడ చేతికే టెక్కలి వస్తుందని చెప్పుకోవచ్చు. ఏమో.. ఏమైనా జరగొచ్చు మరి.. జస్ట్ వెయిట్ అండ్ సీ అంతే..!

YCP got rid of Duvvada!:

YCP party removed Duvvada from the post

Tags:   YCP PARTY
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement