Advertisementt

జైలు నుంచి హాస్పిటల్ కు ఎమ్యెల్సీ కవిత

Thu 22nd Aug 2024 03:48 PM
kavitha  జైలు నుంచి హాస్పిటల్ కు ఎమ్యెల్సీ కవిత
MLC K Kavitha hospitalised in Delhi జైలు నుంచి హాస్పిటల్ కు ఎమ్యెల్సీ కవిత
Advertisement
Ads by CJ

గత కొద్ధి నెలలుగా తీహార్ జైలులో జైలు జీవితం అనుభవిస్తున్న తెలంగాణ ఎమ్యెల్సీ కవిత ఎన్నిసార్లు బెయిల్ కి అప్లై చేసినా ఆమెకి చుక్కెదురవుతుంది. కొద్ది రోజుల క్రితం తన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్ సుప్రీం కోర్టుకు వెళ్లారు. కానీ సుప్రీం కోర్టు తీర్పు వాయిదా వేసింది. 

తాజాగా కవిత తీహార్ జైలులో అస్వస్థతకు గురైంది. దానితో జైలు అధికారులు కవిత ను ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించారు. కవిత గైనిక్ మరియు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలోనూ కవిత వైరల్ ఫీవర్ తో బాధపడగా ఆమెకు జైలు అధికారులు ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. 

ఇప్పుడు మరోమారు కవిత అస్వస్థతకు గురికావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కేటీఆర్, హరీశ్ రావు జైలులో కవితను పలు మార్లు కలిశారు. కానీ ఆమె తండ్రి మాత్రం ఇప్పటి వరకు కవితను కలవలేదు. 

MLC K Kavitha hospitalised in Delhi:

BRS leader K Kavitha taken to hospital from Tihar jail

Tags:   KAVITHA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ