పుష్ప 2 సెట్స్ లో ఏదో జరిగింది.. తన సమయాన్ని సుకుమార్ తినేస్తున్నారు, ఈ మూడేళ్ళలో మరో సినిమా చేసుకునేవాడిని, రీ షూట్స్ అంటూ సుకుమార్ సినిమాని పదే పదే పోస్ట్ పోన్ చెయ్యడం పట్ల అల్లు అర్జున్ కోపంగా ఉన్నాడు అని, తనకి కావాల్సిన అవుట్ ఫుట్ వచ్చేవరకు రీ షూట్స్ చేస్తానని సుకుమార్ మొండికేస్తున్నాడంటూ చాలా వార్తలు వినిపించాయి.
ఈమద్యలో కూడా అల్లు అర్జున్ పుష్ప లుక్ మార్చడం, దర్శకుడు-హీరో చెరో దేశానికీ వెళ్లిపోవడం, వచ్చాక పుష్ప క్లైమాక్స్ షూట్ లోను సుకుమార్ సరిగ్గా కోపరేట్ చెయ్యడం లేదు అంటూ వస్తున్న న్యూస్ లు నిజమే అని అల్లు అర్జున్ వాయిస్ ద్వారా ఇప్పుడు చాలామందికి అర్ధమైంది అంటున్నారు.
తాజాగా అల్లు అర్జున్-సుకుమార్ ఇద్దరూ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఈవెంట్ కి గెస్ట్ లుగా రాగా.. అక్కడ అల్లు అర్జున్ స్టేజ్ ఎక్కి నేను ఫ్యాన్స్ ని చూసే హీరో అయ్యాను, నా సినిమా వచ్చి మూడేళ్లు అవుతుంది. మిమ్మల్ని ఇంకోసారి ఇంత ఇబ్బంది పెట్టను. ఎక్కువ సినిమాలు చేస్తా అని చెప్పడం చూసిన వారు పుష్ప 2 సెట్స్ లో జరిగింది నిజమే.. సుకుమార్ పై అల్లు అర్జున్ చాలా అసంతృప్తితో ఉన్నాడు, అందుకే ఇలా మాట్లాడాడు, ఫ్యాన్స్ కి సారి చెప్పడంటూ గుసగుసలు మొదలు పెట్టారు.