తానేమి వివాదాస్పదంగా మాట్లాడి ఉండకపోవొచ్చు. కానీ కొన్ని కొన్ని సందర్భాలలో ఏం మాట్లాడినా అర్ధాలు మారిపోయి దానికి పెడార్ధాలు తీసేవారు చాలామందే ఉంటారు. ఈమధ్యన ఎలక్షన్ సమయంలో పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియా ద్వారా విష్ చేసి స్నేహితుడు కోసం పబ్లిక్ లోకి వచ్చి సపోర్ట్ చేసిన అల్లు అర్జున్ విషయంలో మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంతో ఉన్నారు. నాగబాబే అల్లు అర్జున్ విషయంలో తన కోపాన్ని సోషల్ మీడియాలో వెళ్ళగక్కాడు.
అప్పటినుంచి మళ్ళీ మిడియా ముందుకు రాని అల్లు అర్జున్ తాజాగా సుకుమార్ వైఫ్ తబిత ప్రెజెంట్ చేస్తున్న ఓ మూవీ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చాడు. ఆ ఈవెంట్ లో తబిత గారు బన్నీ గారు మీరు మా సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా రావాలని అడిగారు. సుకుమార్ గారిని, మిమ్మల్ని కాకుండా ఇంక ఎవర్ని అడుగుతా అన్నారు.. ఆ మాట తర్వాత ఇంక మాటలు లేవు.. మాట్లాడుకోవడాలు లేవు..!
నాకు ఇష్టమైతే నేను వస్తా.. నా మనసుకు నచ్చితే నేను వస్తా.. వస్తున్నా తబిత గారు అని చెప్పా. ఫ్రెండ్ అనుకో, ఇంకొకరు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకోండి.. ఇష్టమైన వాళ్ళ కోసం మనం నిలబడాలి. అంటూ ఇండైరెక్ట్ గా తనేం చెయ్యాలో అది చేస్తా ఆంటూ పవన్ ఫ్యాన్స్ ని అల్లు అర్జున్ మరోసారి కెలికేసినట్లుగా పవన్ ఫ్యాన్స్ ఫీలైపోతున్నారు.