కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని పెద్ద కొడుకులా ట్రీట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో బాబు తర్వాత పొజిషన్ నారా లోకేష్ ది కాదు, పవన్ కళ్యాణ్ ది అన్నట్టుగానే చంద్రబాబు మొదటి నుంచి బిహేవ్ చేస్తున్నారు, తనతో పాటుగా పవన్ కి ప్రతి విషయంలో ప్రిఫరెన్స్ ఇస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో చర్చించాకే ఏ డెసిషన్ అయినా తీసుకుంటున్నారు.
చంద్రబాబు-పవన్ కళ్యాణ్ అనుబంధం చూసి బ్లూ మీడియా కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. వారిని విడగొట్టేందుకు జనసేన-టీడీపీ కార్యకర్తల నడుమ చిచ్చుపెట్టేందుకు కూడా ట్రై చేస్తుంది. పవన్ కి గౌరవం ఇవ్వని చంద్రబాబు అంటూ సోషల్ మీడియాలో పదే పదే క్రియేట్ చేస్తుంది.
కానీ పవన్ కళ్యాణ్ కి ఎంత గౌరవం దక్కుతుందో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే విషయాన్ని టీడీపీ మాజీ నేత, సినీ నటులు మురళి మోహన్ చెబుతున్నారు. బాబు గారు పవన్ కళ్యాణ్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. బాబు గారు అప్పాయింట్మెంట్ తీసుకుని వెళ్లి నంది అవార్డుల గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి చెబుతాను అన్నారు అంటూ మురళి మోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం హైలెట్ అయ్యింది.
మరి మురళి మోహన్ అనడం కాదు.. ఏపీలోని ప్రతి ఒక్కరు అదే మాట చెబుతున్నారు. జనసైనికులు కూడా ఆ విషయంలో ఫుల్ హ్యాపీ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కి అందాల్సిన గౌరవం ఏపీ ప్రభుత్వంలో అందుతుంది అని. పవన్ సలహాలు సూచనలతో చంద్రబాబు సీఎం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.