సుకుమార్-అల్లు అర్జున్ నడుమ జరిగిన మనస్పర్థలు రూమర్స్ కాదు నిజమే అనే టాక్ మరోసారి మొదలైంది. వారి మద్యన ఏమి జరగలేదు అని గీత ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి క్లారిటీ వస్తున్నా.. ప్రస్తుతం పుష్ప ద రూల్ సెట్స్ లో దర్శకుడు-హీరో ఎడ మొహం పెడ మొహంగానే ఉంటున్నారనే మాట వినిపిస్తూనే ఉంది.
సుకుమార్ హెల్త్ రీజన్స్ చెప్పి షూటింగ్ నుంచి మధ్యలోనే వెళ్లిపోతున్నారని, అల్లు అర్జున్ కూడా అంటీముట్టనట్టుగానే కనిపిస్తున్నాడని, నిర్మాతలు వీరిద్దరి విషయంలో ఏం చెయ్యాలో పాలు పోక తలపట్టుకుంటున్నారని అంటున్నారు. ఈ లెక్కన పుష్ప 2 వాయిదా పడొచ్చనే ఊహాగానాలు మళ్లి మొదలైపోయాయి.
డిసెంబర్ 6 కి సినిమా రిలీజ్ అవ్వాలంటే ఖచ్చితంగా సెప్టెంబర్ కల్లా షూటింగ్ పూర్తవ్వాలి, అక్టోబర్, నవంబర్ పోస్ట్ ప్రొడక్షన్ అలాగే పబ్లిసిటీకి సమయాన్ని వెచ్చించాలి. ఇవన్నీ జరగాలంటే ముందుగా షూటింగ్ ఫినిష్ అవ్వాల్సిందే. అన్నట్టు ఈరోజు ఓ సినిమా ఈవెంట్ లో సుకుమార్-అల్లు అర్జున్ కలిసి పాల్గొనబోతున్నారు. చూద్దాం వాళ్ళ బాండింగ్ ఎలా ఉండబోతుందో అనేది.