గత నెల రోజులుగా సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఫీవర్ నడుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమోస్ రావడం, నాగార్జున హోస్ట్ గా ఇంట్రెస్టింగ్ ప్రోమోస్ తో యాజమాన్యం హడావిడి చెయ్యడం, అన్నపూర్ణ స్టూడియోస్ లో బిగ్ బాస్ హౌస్ సెట్ రెడీ అవుతుండడం, బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ లిస్ట్ అన్ని చక్కర్లు కొడుతున్నాయి.
సెప్టెంబర్ 1 కానీ లేదంటే సెప్టెంబర్ 8 కానీ బిగ్ బాస్ సీజన్ 8 లాంచింగ్ డేట్ అంటున్నప్పటికి తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 సెప్టెంబర్ 1 ఆదివారం సాయంత్రం మొదలు కాబోతుంది. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి బిగ్ బాస్ 8 ఓపెనింగ్ ఎపిసోడ్ ని స్టార్ మాలో ప్రసారం కాబోతున్నట్లుగా ప్రకటించారు.
లాంచింగ్ ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ పరిచయాలతో పాటుగా మధ్య మధ్యలో స్పెషల్ డాన్స్ లు, స్పెషల్ పాటలు, సినిమా ప్రమోషన్స్ అంటూ చాలా హంగామా ఉండబోతుంది. సెప్టెంబర్ 7 వినాయకచవితి. అప్పటికల్లా బిగ్ బాస్ సీజన్ 8 మొదలు పెట్టే ఆలోచనలో యాజమాన్యం ఉండి డేట్ లాక్ చేసినట్లుగా తెలుస్తుంది.