Advertisementt

కన్ ఫర్మ్ : గేమ్ ఛేంజర్ డిసెంబర్

Wed 21st Aug 2024 02:54 PM
dil raju  కన్ ఫర్మ్ : గేమ్ ఛేంజర్ డిసెంబర్
Dil Raju: Game Changer is set for Christmas release కన్ ఫర్మ్ : గేమ్ ఛేంజర్ డిసెంబర్
Advertisement
Ads by CJ

గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ లో విషయములో నడుస్తున్న సస్పెన్స్ ను నిర్మాత దిల్ రాజు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. గత రెండు రోజులుగా గేమ్ ఛేంజర్ డిసెంబర్ కు కూడా రాకపోవచ్చు అంటూ కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. దిల్ రాజు డిసెంబర్ లో గేమ్ ఛేంజర్ అంటూ స్టేట్మెంట్ అయితే ఇచ్చారు కానీ శంకర్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు అని మాట్లాడుకుంటున్నారు. 

తాజాగా మరోసారి దిల్ రాజు గేమ్ చెంజర్ డిసెంబర్ అంటూ డిక్లేర్ చేసారు. దిల్ రాజు ఎక్కడ కనిపించినా మీడియా వారు గేమ్ ఛేంజర్  రిలీజ్ ప్రశ్న మాత్రం అడక్కుండా ఊరుకోవడం లేదు. తాజాగా ఆయన సరిపోదా శనివారం మీడియా మీట్ కి హాజరయ్యారు. మరి మీడియా వదులుతుందా.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి చెప్పమని అడిగారు. 

అంటే దిల్ రాజు మారు మాట్లాడకుండా డిసెంబర్ అంటూ మరోసారి గేమ్ ఛేంజర్ రిలీజ్ తేదీని కన్ ఫర్మ్ చేసేసారు. సో మెగా ఫ్యాన్స్ అస్సలు దిగులు పడక్కర్లేదు. డిసెంబర్ చివరి వారం క్రిస్టమస్ కి గేమ్ ఛేంజర్ తో రామ్ చరణ్ సందడి షురూ. కాకపోతే ఆ తేదీ ఏదో అధికారికంగా ప్రకటిస్తే మెగా ఫ్యాన్స్ శాంతిస్తారు దిల్ రాజు గారు.. అదేదో ఆలోచించండి మరి!

Dil Raju: Game Changer is set for Christmas release:

Dil Raju has once again confirmed a Game Changer release in December

Tags:   DIL RAJU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ