పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాదండోయ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పవర్ మాములుగా లేదు. ఏపీ రాజకీయాల్లో నెంబర్ 2 గా చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్ తాను కంప్లీట్ చెయ్యబోయే సినిమాల సెట్స్ మీదకి ఎప్పుడొస్తారో అని పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటుగా ఆయన నిర్మాతలు కూడా ఎదురు చూడని క్షణం లేదు.
తాజాగా పవన్ కళ్యాణ్ తో OG ని నిర్మిస్తున్న దానయ్య సరిపోదా శనివారం మూవీ మీడియా మీట్ లో OG పై క్రేజీ కామెంట్స్ చేసారు. మీడియా వారు అడక్కుండానే అతి త్వరలోనే OG మీ ముందుకు రాబోతుంది అని చెప్పిన ఆయన పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2 న OG నుంచి టీజర్ వదలబోతున్నట్టుగా ఇచ్చిన అప్ డేట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
అక్టోబర్ నుంచి OG రెస్యూమ్ షూట్ ఉండబోతుంది. ఈలోపే అంటే పవన్ పుట్టిన రోజుకి ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చేందుకు మేకర్స్ మాత్రం టీజర్ వదిలెందుకు రెడీ అవుతున్నారు. అదే విషయాన్ని దానయ్య రివీల్ చేసేసారు. సో OG టీజర్ కోసం అభిమానులు మరో పది రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.