Advertisementt

కామెడీ అయిపోయిన గేమ్ ఛేంజర్ డేట్

Wed 21st Aug 2024 11:01 AM
game changer  కామెడీ అయిపోయిన గేమ్ ఛేంజర్ డేట్
A Game Changer date where comedy is over కామెడీ అయిపోయిన గేమ్ ఛేంజర్ డేట్
Advertisement
Ads by CJ

టైటిల్ లో చెప్పినట్టుగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ విషయంలో పెద్ద కామెడీ నడుస్తుంది. దర్శకుడు శంకర్ షూటిం ఫినిష్ చేసినా, పోస్ట్ ప్రొడక్షన్ మొదలు పెట్టినా రిలీజ్ డేట్ లాక్ చేయకుండా మెగా అభిమానుల సహనానికి పరీక్ష పెడుతున్నారు. డిసెంబర్ చివరి వారమంటూ నిర్మాత దిల్ రాజు చెప్పినా శంకర్ నుంచి ఎలాంటి సిగ్నల్స్ లేవు.

రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా RC 16 కోసం ప్రిపేర్ అవుతున్నారు. నిన్ననే భార్య ఉపాసన, కుమార్తె క్లింకార తో కలిసి ఆస్ట్రేలియా నుంచి చరణ్ హైదరాబాద్ చేరుకున్నారు. మరి రామ్ చరణ్ ఇకపై RC 16 సెట్స్ లోకి వెళ్ళిపోతారు. అసలు శంకర్ ఏం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ డిసెంబర్ లో విడుదల ఉంటుందా..

లేదంటే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా మార్చ్ కి షిఫ్ట్ అవుతుందా.. ఏదో విషయం తేల్చకుండా, రిలీజ్ డేట్ ఇవ్వకుండా అభిమానులను కన్ఫ్యూజన్ లో పెట్టడం మాత్రం చాలామందికి నచ్చడం లేదు. వచ్చే ఏడాది సినిమాలకు కూడా రిలీజ్ డేట్స్ లాక్ చేసి మరీ షూటింగ్స్ మొదలు పెడుతున్న సమయంలో గేమ్ ఛేంజర్ మేకర్స్ ఇలా నాన్చడం మాత్రం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. 

A Game Changer date where comedy is over:

Game Changer release date confusion continue

Tags:   GAME CHANGER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ