ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. సీఎంగా నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్.. ఇతర మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అంతా ఓకేగానీ.. పార్టీ కోసం పనిచేసిన, టికెట్లు త్యాగం చేసిన వారి కోసం భర్తీ చేసే నామినేటెడ్ పదవుల విషయంలో ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. వాస్తవానికి ఒక్క టీడీపీ అధికారంలోకి ఒంటరిగా వచ్చి ఉంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది కానీ.. జనసేన, బీజేపీతో కలిసి కూటమి కావడంతో ఆలస్యం అయ్యింది. దీనికి తోడు.. ఒక్కో పార్టీకి ఇన్ని పదవులు పంచుకోవాలి.. ఆశావహులను సంతృప్తి పరచాలి.. ఇలా ఎన్నో లెక్కలు ఉంటాయ్. అందుకే అధికారంలోకి వచ్చి ఇన్నాళ్లు అయినా వర్కవుట్ కాలేదు.
ఫిక్స్ అయినట్టేనా..?
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. నామినేటెడ్ పదవుల పంపకం పూర్తయినట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని టీడీపీ సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఓ జాబితా చక్కర్లు కొడుతోంది. ఇందులో కీలక పదవులన్నీ టీడీపీకి సంబంధించిన వారే ఉండగా.. కొందరు మీడియా గ్రూపునకు సంబంధించిన మనుషులు కూడా ఉన్నారు. ఇక బీజేపీ విషయానికొస్తే.. సీట్లు త్యాగం చేసిన సోమువీర్రాజు లాంటి వారికి ఈ పదవులతో న్యాయం చేయడానికి పార్టీ సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇక జనసేనలోనూ ఇదే పరిస్థితి. అయితే ఇందులో టీడీపీకే ఎక్కువ పదవులు దక్కడంతో కాస్త అసంతృప్తి అనేది ఆటోమాటిక్‌గా ఇతర పార్టీల్లో వస్తుంది.. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియట్లేదు కానీ.. నెట్టింట్లో మాత్రం గట్టిగానే చక్కర్లు కొడుతోంది.
ఎవరికేంటి..!?
టీటీడీ చైర్మన్ : బీఆర్ నాయుడు (టీవీ5 అధినేత)
ఏపీఐఐసీ చైర్మన్ : బొడ్డు వెంకటరమణ చౌదరి
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ : దేవినేని ఉమా మహేశ్వర రావు
ఏపీ టూరిజం : నాదెండ్ల బ్రాహ్మణ చౌదరి
ఫుడ్ కమిషన్ : కొమ్మారెడ్డి పట్టాభి రామ్
శాప్ చైర్మన్ : పొలం రెడ్డి దినేష్ రెడ్డి
మహిళా కమిషన్ : రెడ్డి వాణి
ఏపీ సీడ్ డెవలప్మెంట్ : నీలాయపాలెం విజయకుమార్
ఏపీ మారిటైమ్ బోర్డు : గంప కృష్ణ
ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ : సోము వీర్రాజు
APSRTC రీజనల్ బోర్డ్ చైర్మన్ : షేక్ రియాజ్
ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ : బొబ్బూరి వెంగళరావు
ఏపీ గ్రేనేడ్ బ్యూటిఫికేషన్ : బండ్రెడ్డి రామకృష్ణ
ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ : విష్ణువర్ధన్ రెడ్డి
ఏపీ స్వచ్ఛంద మిషన్ : పాతూరు నాగభూషణం
ఏపీ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ : నిమ్మల క్రిష్టప్ప
ఏపీ మీట్ కార్పొరేషన్ : అనిమిని రవి నాయుడు
ఎస్సీ కమిషన్ చైర్మన్ : పీతల సుజాతః
ఎస్టీ కమిషన్ చైర్మన్ : కిడారి శ్రావణ్ కుమార్
ఏపీ ఎస్ఎంఐడీసీ : రాయపాటి అరుణ
తుడా చైర్మన్ : దివాకర్ రెడ్డి
నెడ్ క్యాప్ చైర్మన్ : ఉక్కు ప్రవీణ్ రెడ్డి
ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ : కొణిదెల నాగబాబు
అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ : ఆలపాటి రాజాలు దాదాపు ఖరారైనట్లుగా సమాచారం. ఇందులో నిజానిజాలెంత అనేది అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వేచి చూడాల్సిందే మరి.