అల్లు అరవింద్ కాంపౌండ్ లో నందమూరి నట సింహం చేస్తున్న టాక్ షో ఆహా NBK అన్ స్టాపబుల్ షో. ఇప్పటికే మూడు సీజన్స్ సక్సెస్ ఫుల్ గా ముగియడమే కాదు, ఆ ఎపిసోడ్స్ అన్ని సూపర్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అందుకే ఇప్పుడు రాబోయే నాలుగో సీజన్ పై విపరీతమైన క్యూరియాసిటీ, ఆసక్తి మొదలయ్యాయి.
ఈ సీజన్ కి మెయిన్ గెస్ట్ లుగా మెగాస్టార్ చిరు, అక్కినేని నాగార్జున లు వస్తారని అంటున్నారు. మెగాస్టార్ విషయం తెలియదు కానీ.. దసరా కి మొదలు కాబోతున్నా ఈ సీజన్ 4కి కింగ్ నాగార్జున, సూపర్ స్టార్ రజినీకాంత్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లను అరవింద్ NBK అన్ స్టాపబుల్ టాక్ షోకి గెస్ట్ లుగా తీసుకురాబోతున్నారని టాక్.
మరి ఈ ఎపిసోడ్స్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో బాలయ్య ఎలా ఆడుకుంటారు, కింగ్ నాగ్ తో బాలయ్య టాక్ షో ఎపిసోడ్ ఎలా ఉండబోతుంది, సీఎం రేవంత్ రెడ్డి తో బాలయ్య ఎంత సరదాగా ఉండబోతున్నారో అనేది అందరిలో పిచ్చ క్యూరియాసిటీగా కనిపిస్తుంది. ఓ నాలుగు నెలల పాటు బాలయ్య టాక్ షో హడావిడి ఉండబోతోందట.