కొద్దిరోజులుగా సమంత రియాక్షన్ కోసం ఎదురు చూడని వారు లేరు. కారణం మాజీ భర్త నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్దమయ్యాడు. హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో.. సమంత ఎలా రియాక్ట్ అవుతుందా, ఇండైరెక్ట్ గా ఏమైనా పోస్ట్ పెడుతుందా అని చాలామంది ఎదురు చూస్తున్నారు.
అదే సమయంలో సమంత ఫ్యామిలీ మ్యాన్ దర్శకుల్లో ఒకరైన రాజ్ తో డేటింగ్ చేస్తుంది అనే రూమర్ కూడా వ్యాపించింది. ఏ విషయము సమంత స్పందించకుండా సైలెంట్ గా ఇప్పుడొక అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. అది సమంత గతంలో క్లోతింగ్ బిజినెస్ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. సాకి బ్రాండ్ పేరుతొ ఆ వ్యాపారం చేస్తుంది.
ఇప్పుడు సమంత మరో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. అదే స్పోర్ట్స్ బ్రాండ్. వరల్డ్ పికిల్ బాల్ లోగోలో చెన్నై ఫ్రాంచైజీని కొను గోలు చేసింది. అదే విషయాన్ని సమంత తెలియజేస్తూ.. ఈ లీగ్ లో తాను చెన్నై టీమ్ కి ఓనర్ గా ఉన్నందుకు హ్యాపీ గా ఉంది అని చెప్పుకొచ్చింది. ఈ సర్ ప్రైజ్ ని మాత్రం సమంత అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.