రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య విషయం ఇంకా మీడియాలో హాట్ హాట్ గా నడుస్తూనే ఉంది. రాజ్ తరుణ్-లావణ్య ల వ్యవహారం ఇప్పటికి తెగడం లేదు. రాజ్ తరుణ్ సైలెంట్ గా ఉండగా.. లావణ్య మాత్రం చానల్స్ లో ఇంకా ఇంకా హడావిడిచేస్తుంది. ఈ అమ్మాయి ని మీరు బిగ్ బాస్ కి వెళుతున్నారని ప్రచారం జరుగుతుంది.. అంటూ ప్రశ్నించగా..
నాకు నిజంగా అవకాశం వస్తే తప్పకుండా వెళతాను అంది. మీరు రాజ్ తరుణ్ గారితో కలిసి హౌస్ లోకి అడుగుపెడితే ఏం చేస్తారని సదరు యాంకర్ అడిగితే.. నాకు బిగ్ బాస్ ఆఫర్ రావాలే కానీ బిగ్ బాస్ కి ఖచ్చితంగా వెళతాను అని చెప్పింది లావణ్య, కానీ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం లావణ్య స్పందించలేదు.
మరి బిగ్ బాస్ 8 స్టార్ట్ అవుతున్న సమయంలో లావణ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే చిత్రం సెప్టెంబర్ 7 న విడుదలకాబోతుంది.