Advertisementt

బాలయ్య పై హిందీ యాక్టర్ కామెంట్స్ వైరల్

Tue 20th Aug 2024 04:42 PM
bobby deol  బాలయ్య పై హిందీ యాక్టర్ కామెంట్స్ వైరల్
Hindi actor praises on Balayya go viral బాలయ్య పై హిందీ యాక్టర్ కామెంట్స్ వైరల్
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ ఎమ్యెల్యేగా, ఇటూ హీరోగా తన పని తాను చేసుకుంటున్నారు. బాబీ దర్శకత్వంలో బాలయ్య NBK 109 చేస్తున్న విషయం తెలిసిందే. దాని తర్వాత బాలయ్య-బోయపాటి కలయికలో మొదలు కాబోయే అఖండ2 కోసం అయన అభిమానులే కాదు మాస్ ఆడియన్స్ అంతా వెయిటింగ్. 

ప్రస్తుతం NBK 109 ని కంప్లీట్ చెసే పనిలో ఉన్న బాలయ్య పై హిందీ నటుడు ఒకరు ప్రశంశల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో హిందీ యాక్టర్, యానిమల్ నటుడు బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. యానిమల్ లో రణబీర్ కపూర్ తో సమానంగా పవర్ ఫుల్ విలన్ గా కనిపించిన బాబీ డియోల్ బాలయ్య చిత్రంలోనూ అంతే పవర్ ఫుల్ కేరెక్టర్ లో కనిపించబోతున్నారు. 

తాజాగా ఆయన బాలయ్య గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. బాలకృష్ణ ది చిన్న పిల్లాడి మనస్తత్వం, సీనియర్ అయినా ఆయనది చిన్నపిల్లాడి తత్త్వం, చాలా ఎనర్జిటిక్ గా  ఉంటారు, ఆయనతో వర్క్ చెయ్యడం నాకు మంచి మెమొరిగా గుర్తుండిపోతుంది. అలాగే కంగువలోను నేను విలన్ పాత్ర చేస్తున్నా. 

హీరో సూర్య కూడా గొప్ప నటుడు. అందరూ అనుకుంటారు. యానిమల్ చూసాక నాకు కంగువలో ఛాన్స్ వచ్చిందేమో అని, కానీ యానిమల్ కి ముందే కంగువా లో విలన్ పాత్రకు సైన్ చేశాను. యానిమల్ ఒప్పుకోకముందే కంగువలో కొన్ని సీన్స్ షూట్ చేసారు అంటూ బాబీ డియోల్ చెప్పుకొచ్చారు. 

Hindi actor praises on Balayya go viral:

Bobby Deol sings praises of Balakrishna

Tags:   BOBBY DEOL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ