Advertisementt

దేవర టీమ్ కు బిగ్ షాకిచ్చిన లీకేజులు

Tue 20th Aug 2024 02:33 PM
devara  దేవర టీమ్ కు బిగ్ షాకిచ్చిన లీకేజులు
Leaks given by Big Shah to Devara team దేవర టీమ్ కు బిగ్ షాకిచ్చిన లీకేజులు
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న దేవర చిత్రం షూటింగ్ రీసెంట్ గానే పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర చిత్రంపై  వినిపించిన ప్రతి ఒక్క న్యూస్ అంటే ఆయుధ పూజ సాంగ్ చిత్రీకరణ కానివ్వండి, సెకండ్ సింగిల్ చుట్టమల్లే సాంగ్ అన్ని వైరల్ గా మారాయి. 

ఆయుధ పూజ సాంగ్ పై దేవర టీమ్ చాలా హైప్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పడు ఈ సాంగ్ లోని కొన్ని సీన్స్ అంటే ఒక 20 సెకండ్స్ బిట్ లీక్ అయ్యి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. దేవర టీమ్ కి ఈ లీకేజ్ తో బిగ్ షాక్ తగిలింది. అనిరుద్ రవిచంద్ర ఆయుధ పూజ సాంగ్ మ్యూజిక్ అదరగొట్టేసాడంటూ ఆ లీకైన బిట్ విన్న వారు మాట్లాడుతున్నారు. 

దేవర షూటింగ్ నుంచి అప్పుడపుడు కొన్ని లీకైనా.. ఇప్పుడు ఆయుధ పూజ సాంగ్ లీకవడం పై మేకర్స్ కూడా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. రీసెంట్ గానే సైఫ్ అలీ బర్త్ డే సందర్భంగా దేవర గ్లిమ్ప్స్ వదలగా అవి అందరిని బాగా ఇంప్రెస్స్ చేసాయి. 

Leaks given by Big Shah to Devara team:

Devara Ayudha Pooja 24 sec song leaked

Tags:   DEVARA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ