మెగాస్టార్ చిరంజీవి-నందమూరి బాలకృష్ణ మధ్యన అనుబంధం ఏమిటి, ఎంత ఉంది అనేది చాలామందికి తెలియంది కాదు. వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద పోటీ పడితే ఆ మజానే వేరు. బాలయ్య-చిరు ఇద్దరి అభిమానులు ఎలాంటి ఆసక్తి చూపిస్తారో తెలియదు కానీ.. మిగతా కామన్ ఆడియన్స్ కి మాత్రం చిరు-బాలయ్య ఫైట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
గత ఏడాది బాలకృష్ణ వీర సింహ రెడ్డితో-మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య తో సంక్రాంతికి పోటీ పడ్డారు. అది ఒకే రోజు కాకపోయినా.. ఒకరోజు అటు ఇటుగా బాలయ్య-చిరులు బాక్సాఫీసు వేటకి దిగారు. మరోసారి వీరిద్దరి మద్యన అదే సంక్రాంతి ఫైట్ రిపీట్ అవ్వబోతుందా అంటే అవుననే అంటున్నారు.
అది మెగాస్టార్ చిరంజీవి-వసిష్ఠ కలయికలో రాబోతున్న విశ్వంభర చిత్రం ఇప్పటికే సంక్రాంతి రిలీజ్ అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇప్పుడు అదే సంక్రాంతికి బాలయ్య తన NBK 109 తో రాబోతున్నాడని తెలుస్తుంది. బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న NBK 109 అసలైతే డిసెంబర్ రిలీజ్ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం బాలయ్య-బాబీ ఇద్దరూ సంక్రాంతి కి రావాలని డిసైడ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ లెక్కన మెగాస్టార్ చిరు-బాలయ్య మళ్ళీ ఫైట్ రెడీ అయినట్లే కదా.!