Advertisement
TDP Ads

చంద్రబాబు అంటే తమాషాగా ఉందా..?

Tue 20th Aug 2024 11:05 AM
chandrababu  చంద్రబాబు అంటే తమాషాగా ఉందా..?
Is Chandrababu funny? చంద్రబాబు అంటే తమాషాగా ఉందా..?
Advertisement

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే అధికారులకు తమాషాగా ఉందా..? ఎప్పుడు చూసినా ఏదో ఒక రచ్చ చేస్తూనే ఉన్నారేంటి..? కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ అధికారుల వల్ల అస్తమానూ సీఎం ఇబ్బంది పడాల్సి వస్తోందేం..? ఈ పరిణామాలన్నింటికీ ఫుల్ స్టాప్ పడే పరిస్థితుల్లేవా..? ఒకసారి.. రెండు సార్లు.. మూడు సార్లు ఓకే కానీ పదే పదే ఇలాంటి ఘటనలే రిపీట్ కావడమేంటి..? చంద్రబాబుకే ఎందుకిలా జరుగుతోంది..?

ఎందుకిలా..?

వైసీపీ సర్కార్ రోజులు గడుస్తున్నా కొందరు అధికారుల్లో ఏ మాత్రం మార్పు రాలేదన్న విషయం క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. అదెలాగంటే.. ఏదో ఒక రూపంలో అధికారులు తోకలు ఆడిస్తూనే ఉన్నారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు మొదలుకుని చిన్నస్థాయి అధికారుల వరకూ తోకలు కత్తిరించినా.. ఇంకా కత్తిరిస్తూనే ఉన్నా అబ్బే అస్సలు మార్పు రాకపోవడం గమనార్హం. నాడు.. శ్వేతపత్రం రిలీజ్ చేసే రోజున సాక్షాత్తూ సచివాలయంలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో తేడాలు రావడం, ఒకటి క్లిక్ చేస్తే మరొకటి రావడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తీరా చూస్తే.. ఇదంతా అధికారులు చేసిన పని అని తేలింది. స్పాట్‌లోనే ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయాలని ఇచ్చిపడేశారు. ఆ తర్వాత మరో సందర్భంలో మైక్ విషయంలో సమస్య వచ్చింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలానే ఉన్నాయి.

అన్ని చోట్లా ఉన్నారే..!

ఆఖరికి ఆగస్టు-19 నాడు సోమశిల ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లినప్పుడు కూడా ఇలాంటి మైక్ సమస్యే తలెత్తింది. దీంతో బాబు తన విశ్వరూపం చూపించాల్సి వచ్చింది. ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. పోనీ.. సచివాలయంలో, పెద్ద స్థాయి అధికారుల్లో మాత్రం వైసీపీ రక్తం ప్రవహిస్తోంది అనుకున్నా.. జిల్లాలు, మండల స్థాయిల్లోనూ ఇంకా ఆ వేడి పోలేదు.. ఆ వాతావరణం నుంచి బయటికి రాలేకపోతున్నారు.. అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. మర్యాదగా చెబుతున్నా అంటూ నెల్లూరు వేదికగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి వచ్చిందంటే సీఎం ఎంత విసిగిపోయారో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను బంతాట ఆడుకున్న చరిత్ర చంద్రబాబుది. సీఎం అంటే చాలు భయపడిపోయేవారు.. అలా ఉండేది పరిస్థితి. బహుశా త్వరలోనే ఆ పరిస్థితి వస్తుందేమో..!

అయినా.. మార్పు లేదేం..?

వైసీపీతో అంటకాగిన అధికారులు ఎలాంటి శిక్ష అనుభవిస్తున్నారో కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్నప్పటికీ కొందరు అధికారుల్లో అస్సలు మార్పే రావట్లేదు. అయినా.. అధికారులకు మారలేదు అని పదే పదే చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. పోనీ ఇలా తోక ఆడిస్తే సర్కార్ కత్తిరించేస్తే ఏమవుతుంది..? అడ్రస్ లేకుండా పోతారన్న విషయం మరిచిపోయి ప్రవర్తిస్తే ఎలా..? అని మేథావులు చెబుతున్న మాట. బీ క్లియర్.. 95 సీఎం అని పదే పదే చంద్రబాబు చెబుతున్నా అర్థం కాకుంటే ఎలా..? ఇప్పటికైనా అర్థం చేసుకుని మెలిగితే మంచిది సుమీ. అధికారులకు ఉద్యోగాలు కావాలంటే ఒళ్లు దగ్గరెట్టుకుని పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరోక్షంగా ప్రతిసారీ ముఖ్యమంత్రి హెచ్చరిస్తూనే వస్తున్నారు. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతే ఎలా.. ఒకసారి రెండు సార్లు మర్యాద.. ఇక యాక్షన్ ఉంటుందనే విషయాన్ని గుర్తు పెట్టుకుని మెలిగితే మంచిదని స్వయంగా చంద్రబాబే చెబుతున్నారంటే ఒళ్లు దగ్గరపెట్టుకోవాల్సిందే.. లేకుంటే కష్టమే. అయినా 2024 సీఎం కావాలో.. లేదంటే 1995 సీఎం కావాలో తేల్చుకోవాల్సిన అవసరం అధికారులకు వచ్చేసింది.. ఏం డిసైడ్ అవుతారో.. ఏంటో మరి..!

Is Chandrababu funny?:

Chandrababu Jhulum on officials who are in favour of YCP

Tags:   CHANDRABABU
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement