సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే దర్శకుడు హరీష్ శంకర్ తనపై ఎవరైనా ఏమైనా కామెంట్స్ చేస్తే వెంటనే వాటికి ఘాటుగా రిప్లై ఇచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ అభిమానులతో ఉస్తాద్ భగత్ సింగ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి పోరాడుతున్న హరీష్ శంకర్ పై కొంతమంది జర్నలిస్ట్ లు కూడా గుర్రుగానే ఉన్నారు.
తాజాగా హరీష్ శంకర్ తెరకెక్కించిన మిస్టర్ బచ్చన్ గత గురువారం విడుదలై ప్రేక్షకులను బాగా డిజ్ పాయింట్ చెయ్యడంతో సోషల్ మీడియాలో పలువురు హరీష్ శంకర్ పై దుమ్మెత్తిపోతున్నారు, ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఓవర్ కాన్ఫిడెన్స్ తో మాట్లాడిన హరీష్ శంకర్ ని మిస్టర్ బచ్చన్ రిజల్ట్ పై నెటిజెన్స్ ఓ ఆటాడుకుంటున్నారు.
దానితో హరీష్ శంకర్ తాజాగా నిర్వహించిన ఫ్యాన్స్ మీట్ లో మట్లాడుతూ.. తనపై కొంతమంది వ్యక్తిగత ఎజెండాతో దాడి చేస్తున్నారు. కావాలనే తనని టార్గెట్ చేస్తున్నారు అంటూ మాట్లాడాడు. ఈమధ్య కాలంలో రవితేజ తో పని చేసిన దర్శకులపై జరగని మాటల దాడి తనపై జరుగుతుంది. రవితేజ ఖిలాడీ, ఈగల్, రామ రావు ఆన్ డ్యూటీ, టైగర్ నాగేశ్వరావు ఇవన్నీ ప్రేక్షకులను డిజ్ పాయింట్ చేసాయి.
మరి వాటిని తెరకెక్కించిన దర్శకులను ఏమి అనని వారు తన విషయంలో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని నాకనిపిస్తుంది అంటూ హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.