రీసెంట్ గా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతోనే కాదు.. మాజీ ప్రియురాలు లావణ్య కేసులో ప్రేక్షకుల మదిలో మెదిలిన రాజ్ తరుణ్ కి అటు సినిమాలు క్లిక్ అవ్వలేదు, ఇటు లావణ్య వ్యవహారము తేలలేదు. పురుషోత్తముడిగా సైలెంట్ గా వచ్చి తిరగబడరా సామికి హడావిడి చేసినా రాజ్ తరుణ్ సినిమాలను ప్రేక్షకులు పట్టించుకోలేదు.
ఇప్పుడు నెల తిరక్కుండానే మూడో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రాజ్ తరుణ్ సిద్దమవడం నిజంగా షాకింగ్ అనే చెప్పాలి. రాజ్ తరుణ్ లేటెస్ట్ మూవీ భలే ఉన్నాడే వచ్చే నెల 7 న రిలీజ్ కి సిద్దమవడమే కాకుండా.. మెల్లగా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా మొదలు పెట్టేసుకుంది.
భలే ఉన్నాడే ట్రైలర్ వదలగా అది చూసి ప్రేక్షకులు ఇంప్రెస్స్ అవుతున్నారు. మరి ఈ సినిమా అయినా రాజ్ తరుణ్ కి వర్కౌట్ అయ్యి తిరిగి నిలబడతాడా అనేది మాత్రం అందరిలో పేద్ద క్వచ్చన్ మార్క్ అనే చెప్పాలి. కొన్నేళ్లుగా రాజ్ తరుణ్ సినిమాలు చేస్తున్నా అవి నిరాశారుస్తున్నాయి తప్ప ఏది అతనికి వర్కౌట్ అవ్వడం లేదు. కనీసం భలే ఉన్నాడే అయినా రాజ్ తరుణ్ కి సక్సెస్ ఇవ్వాలని కోరుకుందాం.