TV మూర్తి తన టీమ్ తో ఐదు కోట్లు ఇవ్వమని తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ జ్యోతిష్కుడు వేణు స్వామి ఆయన భార్య వీణ-శ్రీవాణి వదిలిన వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. తమని TV మూర్తి అనుచరుడు అమర్ అనే జర్నలిస్ట్ ఐదు కోట్ల కోసం డిమాండ్ చేసిన ఆడియో క్లిప్పింగ్ ని కూడా షేర్ చేసారు.
నాగ చైతన్య -శోభిత ల జాతకం విషయంలో అడ్డంగా బుక్ అయిన వేణు స్వామి ఇప్పుడు ఇలా మూర్తి తన అనుచరులతో తమని డబ్బు కోసం వేధిస్తున్నాడు అని.. వీణ శ్రీవాణి మేము ఐదు కోట్లు ఎక్కడ నుంచి తెచ్చివ్వగలము, నా బంగారం, నా కూతురు బంగారం అమ్మినా ఐదు పర్సెంట్ కూడా రాదు అని చెప్పగా.. తాను ఈ పది రోజుల నుంచి ఈ టార్చర్ తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళి పదిహేను కిలోల బరువు తగ్గినట్టుగా వేణు స్వామి చెప్పాడు.
ఇక వీణ - శ్రీవాణి డబ్బు డిమాండ్ చేయడమనేది బ్లాక్ మెయిల్ కాదు చంపెయ్యడమే.. నేను ఒకొనొక సమయంలో సూసైడ్ చేసుకుందామనుకున్నాను, అది కూడా ఈ జర్నలిస్టు లు అనుకూలంగా వాడేసుకుంటారు, TV 5 మూర్తి మాత్రమే కాదు.. ఇంకా కొద్దిమంది జర్నలిస్టులకు కూడా ఇందులో వాటా ఉంది, ఈ వీడియో వదిలాక వారు మమ్మల్ని చంపేస్తారు. అందుకే నిజాలు చెబుదామని ఈ వీడియో ఇస్తున్నాము.
ఇంకా మా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. కిలారు రాజేష్ జూబ్లీహిల్స్ క్లబ్ లో మీటింగ్ పెట్టాడు. అవన్నీ ఆధారలతో సహా మాదగ్గర ఉన్నాయంటూ, ఇది సుమోటాగా కేసు స్వీకరించి తమని రక్షిస్తే ఇంకా కొన్ని ప్రూఫ్స్ బయటపెడతాము, లేదంటే ఇదే మా చివరి వీడియో అంటూ వేణు స్వామి-ఆయన భార్య వీణ శ్రీవాణి ఆ వీడియో లో చెప్పడం సంచలనంగా మారింది.