స్టార్ హీరోలు ఒకే రోజు బాక్సాఫీసు వద్ద పోటీ పడడం వేరు. అది ప్రేక్షకులకు మజా ఇస్తుంది. అదే హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకేరోజు విడుదలై పోటీకి దిగడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. గత ఏడాది శృతి హాసన్ నటించిన వీరసింహ రెడ్డి-వాల్తేర్ వీరయ్య సినిమాలు ఒక రోజు తేడాతో ఆడియన్స్ ముందుకు రాగా.. శృతి హాసన్ రెండు చిత్రాలతో సక్సెస్ అందుకుంది.
ఇప్పుడు అదే మాదిరి కాదు.. ఒకేరోజు తాను నటించిన రెండు సినిమాలతో బాక్సాఫీసు దగ్గర పోటీకి సిద్దమైంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. అది డిసెంబర్ 6 రష్మిక కి మర్చిపోలేని రోజు కాబోతుంది. డిసెంబర్ 6 న రష్మిక మందన్న నటిస్తున్న పుష్ప ద రూల్ విడుదల అంటూ మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. మధ్యలో తేదీ మారొచ్చని అన్నా మేకర్స్ మాత్రం డిసెంబర్ 6 నే అంటూ మరోసారి స్ట్రాంగ్ గా డేట్ ఇచ్చారు.
ఇప్పుడు పుష్ప హీరోయిన్ రష్మిక హిందీలో నటిస్తున్న మరో చిత్రమూ అదే డిసెంబర్ 6 న విడుదలకు సిద్దమవుతుంది. రష్మిక-విక్కీ కౌశల్ జంటగా హిందీలో తెరకెక్కుతున్న చావా మూవీ డిసెంబర్ 6 రిలీజ్ అంటూ చావా టీజర్ తో మేకర్స్ ఈ రోజే ఎనౌన్స్ చెయ్యడంతో డిసెంబర్ 6 రష్మిక అభిమానులకు ఇంట్రెస్టింగ్ గా మారింది.