బిగ్ బాస్ సీజన్ తెలుగులో స్టార్ట్ అయినప్పుడు ఆ షోలోకి కేవలం సెలబ్రిటీస్ కి మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఆ తర్వాత సీజన్స్ నుంచి కామన్ మాన్ లను కూడా హౌస్ లోకి తీసుకొస్తున్నారు. అందులో సంజన, నూతన్, గత సీజన్ కి రైతు బిడ్డ ట్యాగ్ తో పల్లవి ప్రశాంత్ అడుగుపెట్టాడు. అయితే హౌస్ లో కామన్ మ్యాన్స్ అంటూ వారు చేసే రచ్చ మాములుగా ఉండడం లేదు.
గత సీజన్ లో పల్లవి ప్రశాంత్ కి అమర్ దీప్ కి మద్యన జరిగిన కోల్డ్ వార్ కారణంగా బిగ్ బాస్ ఫినిష్ అయ్యాక బయట పల్లవి ప్రశాంత్ అభిమానులు రచ్చ రచ్చ చేస్తూ అమర్ దీప్ ఫ్యామిలిపై ఇష్టం వచ్చినట్టుగా చెలరేగిపోయి దాడి చేసిన ఘటన బిగ్ బాస్ యాజమాన్యానికి కొత్త తలనెప్పి తెచ్చిపెట్టింది.
పల్లవి ప్రశాంత్ జైలు పాలవడం ఇవన్నీ బిగ్ బాస్ కి షాకిచ్చాయి. ఈసారి అంటే బిగ్ బాస్ 8 సీజన లోకి ఎలాంటి కామన్ మ్యాన్ కి ఛాన్స్ ఇవ్వొద్దని బిగ్ బాస్ యాజమాన్యం ఫిక్స్ అయినట్లుగా చెబుతున్నారు. అందుకే ఈసారి సీజన్ ని యుట్యూబర్స్, ఇన్స్టా ఇన్ఫ్లుయన్సర్స్ తో నింపేయ్యబోతున్నారట.
మరి ఈసారి సీజన్ 8 లో ఎలాంటి కామన్ మ్యాన్ ని బిగ్ బాస్ ప్రేక్షకులు చూడలేరు అంటున్నారు. చూద్దాం ఈ సీజన్ ఎలా ఉండబోతుందో అనేది.