పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో హీరోయిన్ గా అవకాశం వస్తే మాములుగా ఉంటదేంటి.. ఇప్పుడు అదే అనుభవాన్ని ఇమాన్వీ చవి చూస్తుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ చెయ్యబోయే ఫౌజి (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన యూట్యూబర్ ఇమాన్వి ఇస్మాయిల్ పై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. సోషల్ మీడియా లో ఉండేవాళ్ళకు ఇమాన్వి ఇస్మాయిల్ ఎవరో అనేది ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
ఢిల్లీలో పుట్టిన ఇమాన్వీ డ్యాన్స్ మీద ఇష్టంతో జాబ్ ని కూడా వదులుకుంది. ఒక పక్క డ్యాన్స్ నేర్చుకుంటూనే మరో పక్క ఎంబీఏ పూర్తి చేసింది. ఆమెకు డాన్స్ పై ఉన్న ఇష్టాన్ని గమనించిన ఇమాన్వి ఇస్మాయిల్ తండ్రి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించమని ప్రోత్సహించడంతో ఆమె యుట్యూబ్ స్టార్ట్ చేసింది. ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్స్, వేసే ఖఠినమైన డాన్స్ స్టెప్స్ అన్ని ఇమాన్వీ ప్రభాస్ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేలా చేసింది.
అందుకే ఇమాన్వీ పుట్టుపూర్వోత్తరాలు కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ కూడా గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఈ పాప ప్రభాస్ పక్కన స్క్రీన్ పై ఎలా ఉంటుందో అని అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తున్నారు