ఫ్యాషన్ కి కేరాఫ్ గా నిలిచే యాంకర్ అనసూయ 40 ప్లస్ లోను అదిరిపోయే స్టైలిష్ దుస్తులతో యూత్ ని టార్గెట్ చేస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో స్పెషల్ ఫోటో షూట్స్ తో హడావిడి చేసే అనసూయ తాజాగా వదిలిన ఫొటోస్ చూస్తే అనసూయా ఏంటీ అవతారం అంటారేమో..
డార్క్ కలర్ మోడ్రెన్ అవుట్ ఫిట్ లో అంతే డార్క్ కలర్ లిప్ స్టిక్ తో తలపై డ్రెస్ కప్పుకుని కొత్తగా ట్రై చేసింది. ప్రస్తుతం అనసూయ లేటెస్ట్ ఫోటొస్ నెట్టింట సంచలనంగా మారడమే కాదు.. అనసూయ స్టార్ మా కిరాక్ బాయ్స్ - కిలాడీ గర్ల్స్ కోసం వేసిన కొత్త అవతరంపై నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే అనసూయ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీ గా ఉంది. పుష్ప 2 షూటింగ్ తో పాటుగా ఇంకా కొన్ని సినిమాల్లో నటిస్తుంది.