మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆసుపత్రిలో చేరారు అనే వార్త చూసి ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ ఏజ్ లోను ఎంతో ఫిట్ గా కనిపించే మోహన్ లాల్ ఉన్నట్టుండి ఆసుపత్రి పాలవడం ఏమిటా అని అభిమానులు ఆందోళనపడుతూ అసలు మోహన్ లాల్ కి ఏమైందో అని వారు మాట్లాడుకుంటున్నారు.
మోహన్ లాల్ కి తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఫ్యామిలీ మెంబెర్స్ ఆయనను కొచ్చిలోని అమృత ఆసుపత్రిలో చేర్చారు. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు బారిన పడిన మోహన్ లాల్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడడమే కాకుండా పూర్తిగా కోలుకునే వరకు ఓ 5 డేస్ ఆయన విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ సూచించారు.
అంతేకాకుండా రద్దీ ప్రదేశాలలో తిరగకూడదని, షూటింగ్స్ కు కొన్నిరోజులపాటు దూరంగా ఉండాలని డాక్టర్స్ వదిలిన మోహన్ లాల్ మెడికల్ బులెటిన్ లో సూచించారు. ప్రస్తుతం మోహన్ లాల్ హెల్త్ విషయంలో కంగారు లేదని, మోహన్ లాల్ కోలుకుంటున్నారని తెలుస్తోంది.