ఆగష్టు 15 బాక్సాఫీసు ఫైట్ లో మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ ల మధ్యలో నలిగిపోయి గాల్లో కలిసిపోతుంది అనుకున్న ఎన్టీఆర్ బావమరిది సినిమా ఆయ్ ఇప్పుడు ఆ రెండు సినిమాలకు చుక్కలు చూపిస్తుంది. అటు తమినాట నుంచి తంగలాన్ తాకిడిని కూడా తట్టుకుని ఆయ్ మూవీ ఈ వీక్ విన్నర్ గా నిలవడం నిజంగా ఆశ్చర్యకర విషయమే.
ఆగస్టు 15 గురువారం నుంచి రక్షాబంధన్ సోమవారం వరకు లాంగ్ వీకెండ్ ని ఏ సినిమా క్యాష్ చేసుకుంటుందో అనుకుంటే ఆ అదృష్టం ఆయ్ కి పట్టింది. ప్రమోషన్స్ లోను డబుల్ ఇస్మార్ట్-మిస్టర్ బచ్చన్ లతో పోటీ పడి మరీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయ్ మూవీకి ప్రేక్షకులు ఓటేశారు. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ విషయంలో మౌత్ టాక్ ఎఫెక్ట్ అయ్యింది.
అదే మౌత్ టాల్క్ ఆయ్ కి ప్లస్ అయ్యింది. ఆయ్ సినిమాకి ఆగష్టు 15 సాయంత్రం షోస్ నుంచే పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఈ వారం ప్రేక్షకులకు బెస్ట్ చాయిస్ అయ్యింది. మిస్టర్ బచ్చన్ కి రవితేజ క్రేజ్, డబుల్ ఇస్మార్ట్ కి రామ్ క్రేజ్ పని చెయ్యలేదు. నార్నె నితిన్ అంటే మ్యాడ్ చిత్రంలో ఒక హీరో మాత్రమే. అందుకే ఆయ్ విడుదలకు ముందు అంత బజ్ కనిపించలేదు. కానీ సినిమా విడుదలయ్యాక కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తుంది.
హీరో నార్నె నితిన్, హీరోయిన్ నయన్ సారిక, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, రాజ్ కుమార్ కామెడీ అన్ని ఆయ్ సినిమాకు ప్లస్ అవ్వడంతో ఈ హాలిడేస్ కి ప్రేక్షకులు పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఎంజాయ్ చేస్తూ ఉండడంతో ఈ చిత్రం మంచి హిట్ అనిపించుకుంది.