అర్జున్ రెడ్డి తో ఒక్కసారిగా అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆ తర్వాత మహేష్ బాబు తో సినిమా చేయాలనుకుని మహేష్ ని కూడా కలిసి కథ వినిపించాడు. కానీ ఆ కాంబో పై మీడియాలో వార్తలు రావడమే కానీ.. వర్కౌట్ అవ్వలేదు. ఈలోపు సందీప్ వంగ బాలీవుడ్ కి వెళ్లి కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలు చేసి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ ఓకె అయ్యింది. ప్రస్తుతం స్పిరిట్ స్క్రిట్ వర్క్ తో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగ ని మహేష్ తో సినిమా ఎప్పుడు ఉంటుంది అని అడిగితే ఇపుడు ప్రస్తుతం నాకు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి పూర్తవ్వాలంటే నాలుగేళ్లు పడుతుంది అంటూ మహేష్ సినిమాపై సందీప్ వంగ తేల్చేసాడు.
త్వరలోనే స్పిరిట్ మూవీ షూటింగ్ మొదలు అవుతుంది. అటు తర్వాత యానిమల్ పూర్తి చెయ్యాల్సి ఉంటుంది. అప్పటికి నాలుగేళ్లు పడుతుంది అంటూ సందీప్ రెడ్డి వంగా మహేష్ తో సినిమా విషయంలో రియాక్ట్ అయ్యాడు. మరి ఆ తర్వాత అల్లు అర్జున్ తో ఓ కమిట్మెంట్ ఉంది, ఈమధ్యన చిరుతో సందీప్ వంగ అంటున్నారు.
ఇన్ని పూర్తయ్యాకే మహేష్ తో అంటే ఎట్టి పరిస్థితి ఎలా ఉంటుందో అదన్నమాట మహేష్-సందీప్ రెడ్డి కాంబో కథ.