Advertisementt

దారిలోకొచ్చిన శ్రీలీల

Sun 18th Aug 2024 12:19 PM
sree leela  దారిలోకొచ్చిన శ్రీలీల
Sreeleela Rejects This film Offer దారిలోకొచ్చిన శ్రీలీల
Advertisement
Ads by CJ

శ్రీలీల కెరీర్ స్టార్ట్ చేసినపుడు వరస ఆఫర్స్ రావడంతో ఆలోచించకుండా, తన కేరెక్టర్ ఏమిటి అనేది చూసుకోకుండా సినిమా ఆఫర్స్ ఓకే చేసింది. యంగ్ హీరోలు వరస ఆఫర్స్ ఇచ్చేసరికి శ్రీలీల ఎగ్జైట్ అవుతూ.. ఒప్పుకున్న సినిమాలన్నిటిలో ఒకే మాదిరి కేరెక్టర్స్ చేసి చేతులు కాల్చుకుంది. 

తన పాత్రకి ఎలాంటి ప్రాధాన్యత ఉంది అనేది అంచనా వెయ్యడంలో శ్రీలీల తడబడింది. గుంటూరు కారం తర్వాత బాగా బ్రేక్ తీసుకుని నితిన్, రవితేజ సినిమాలు చేస్తున్న శ్రీలీల ఈమధ్యన బాలీవుడ్ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేసింది అనే న్యూస్ బాగా వైరల్ అయ్యింది. తన డేట్స్ సర్దుబాటు చెయ్యలేను అని ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అన్నారు. 

ఇప్పుడు తాజాగా మెగాస్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్ వచ్చింది అని ఎగిరి గంతేయ్యకుండా సున్నితంగా ఆ ఆఫర్ ని తిరస్కరించడం చూసి అబ్బో శ్రీలీల దారికొచ్చింది, తెలివిగా చిన్న చిన్న ఆఫర్స్ ని ఒప్పుకోవడం లేదు అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇంతకీ ఏ ఆఫర్ ని ఆమె వదులుకుంది అంటే మెగాస్టార్ చిరు-వసిష్ఠ కాంబోలో రాబోతున్న విశ్వంభర చిత్రంలో శ్రీలీల కి స్పెషల్ సాంగ్ అవకాశం వచ్చిందట. 

కానీ కెరీర్ లో ఎదుగుతున్నప్పుడు ఇలాంటి సాంగ్స్ చెయ్యకూడదు అని శ్రీలీల మెగాస్టార్ విశ్వంభర స్పెషల్ సాంగ్ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లుగా చెబుతున్నారు. 

Sreeleela Rejects This film Offer:

Sree leela rejects offer in Vishwambhara?

Tags:   SREE LEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ