Advertisementt

చంద్రబాబు తర్వాత సీఎం అయ్యేదెవరు?

Sun 18th Aug 2024 10:58 AM
chandrababu,pawan kalyan,lokesh nara  చంద్రబాబు తర్వాత సీఎం అయ్యేదెవరు?
who Deserves the Chair after Chandrababu? చంద్రబాబు తర్వాత సీఎం అయ్యేదెవరు?
Advertisement

నారా చంద్రబాబు నాయుడు తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదేవరు..? ఇప్పుడిదే సోషల్ మీడియా వేదికగా నడుస్తున్న పెద్ద చర్చ.. అంతకు మించి టీడీపీ జనసేన పార్టీ శ్రేణుల మధ్య జరుగుతున్న రచ్చ..! దీనికి పెద్ద పోల్ పెట్టి మరీ గోల గోల చేసేస్తున్నారు ఇరు పార్టీల అభిమానులు.. కార్యకర్తలు. ఐతే.. ఈ పరిణామాన్ని ఆస్వాదిస్తూ వస్తున్న వైసీపీ శ్రేణులు అగ్గికి ఆజ్యం పోసినట్టుగా మరింత రెచ్చగొట్టేలా హడావుడి చేస్తున్నాయి. ఇంతకీ రేసులో ఎవరెవరు ఉన్నారు..? ఎవరు ఎవరిని కోరుకుంటున్నారు..? అనే విషయాలు తెలుసుకుందాం వచ్చేయండి..!

సేనాని ఎందుకు కాకూడదు..?

బాబు తర్వాత సీఎం రేసులో ఉన్నది ఎవరో కాదండోయ్.. ఒకరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరొకరు నారా లోకేష్. మొదట పవన్ గురుంచి మాట్లాడుకుందాం. ఒకటి కాదు రెండుసార్లు టీడీపీ అధికారంలోకి రావడానికి అహర్నిశలు శ్రమించి వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 2014 లో సంగతి అటుంచితే 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడంతో వైసీపీ అఖండ మెజారిటీ స్థానాలు.. కలలో కూడా ఊహించని స్థానాలు 151 అసెంబ్లీ సీట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. అలాంటి పార్టీని అదఃపాతాళానికి తొక్కి అడ్రెస్స్ లేకుండా చేయడం అంటే అషామాషీ విషయం కానే కాదు. అలాంటిది చెప్పి మరీ అన్నంత పని చేశారంటే అస్సలు ఒకసారి ఉహించుకుంటేనే ఆ ఊహ ఎలా ఉంటుందో చూడండి. రెండుసార్లు కూటమి కట్టడంలో.. అధికారంలోకి తీసుకురావడంలో కర్త, కర్మ, క్రియ పవన్ కళ్యాణ్ మాత్రమే అని ఆ పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయ్. రేపు పొద్దున్న 2029 ఎన్నికల్లో ఇదే కాంబోతో వెళితే కచ్చితంగా గెలుపు కూటమిదే.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు అనుకుంటా..! అలాంటిది పవన్ సీఎం పదవికి వందకు వెయ్యి శాతం అర్హుడే.. ఇవ్వాల్సిందే.. ఇచ్చితీరాల్సిందే..!

లోకేష్ ఏమీ తక్కువ కాదే!

నారా లోకేష్ కూడా సీఎం పదవికి అర్హుడే.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఎందుకంటే చంద్రబాబు వారసుడు.. పార్టీలో నంబర్ 2 కూడా..! 2014 సంగతి అటుంచితే 2024లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి అధికారంలోకి రావడానికి తనవంతు ప్రయత్నాలు చేశారు లోకేష్. యువగళం పాదయాత్ర చేసి రాష్ట్రమంతా యువతను బాగా ఆకర్షించారు. ఒక్క యువతే కాదు అన్ని వర్గాలను తనవైపు తిప్పుకొని వైసీపీ వల్ల ఒరిగిందేమీ లేదని.. అధికారంలోకి వచ్చాక అద్భుతాలు చేసి చూపిస్తామని చెబుతూ వచ్చారు. దీంతో ఎక్కడలేని జనాల్లో క్రేజ్ వచ్చేసింది. అదికూడా ఎంతలా అంటే చంద్రబాబు ఈ ఐదేళ్ళలోనే చినబాబును సీఎం చేసినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు.. అన్నట్టుగా సీన్ మొత్తం క్రియేట్ ఐపోయింది. ఆయన్ను సీఎంగా చూడాలని యూత్.. టీడీపీ శ్రేణులు నాడు గట్టిగా అనుకునే ఓట్లు గుద్దారు. ఇప్పటికే డిమాండ్ కూడా బుద్దా వెంకన్న, టీడీపీ యూత్ నేతల రూపంలో మొదలైంది కూడా. 

ఎవరికి ఛాన్స్..?

ఈ ఇద్దరిలో ఎవరికి ఛాన్స్ వచ్చినా రావొచ్చు కానీ.. టీడీపీ మాత్రం చినబాబుకు ఇవ్వాలని కోరుకుంటోంది. జనసేన ఐతే సేనానికి సీఎం పదవి ఇచ్చి తీరాలని.. ఎప్పుడో సంగతి కాదు ఈ ఐదేళ్లలోనే ఇవ్వాల్సిందే అని గట్టిగా పడుతున్నారు. అంతే కాదు టీడీపీలోని కొందరు కూడా సేనానికే సపోర్టు చేస్తున్నారు ఎందుకంటే.. ఏ మాటకు ఆ మాట పవన్ లేకుండా రెండు సార్లు టీడీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదనే మాటను కూడా గుర్తు చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా పవన్ లేకుండా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని.. అటు టీడీపీ, ఇటు జనసేన చెప్పుకుంటున్నాయి. అందుకే అటు పవన్.. ఇటు లోకేష్ ఇద్దరినీ ముఖ్యమంత్రిగా చేయాల్సిందే అనే డిమాండ్ పెరుగుతోంది. అది ఎలాగంటే.. ఈ టెర్ములో సీఎం చేయాల్సి వస్తే చివరి రెండేళ్ళలో ఒక ఏడాది పవన్.. మరో ఏడాది చినబాబును పీఠంపై కూర్చోబెడితే న్యాయం చేసినట్టు ఉంటుంది. లేదు ఈ టర్ములో లోకేష్ రెండేళ్లు సీఎంగా చేసినా.. 2029లో గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం కావాల్సిందే.. సీఎంగా చూడాల్సిందే అన్నది జనసేన శ్రేణులు డిమాండ్.

కామెంట్లే కామెంట్లు..! 

ఇక సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్స్ చూస్తే.. అబ్బో అవన్నీ మాటల్లో చెప్పలేం.. రాతల్లో రాయలేం అంతే..! బాబోయ్ ఈ ఇద్దరూ కాదు జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలని కొందరు టీడీపీ కార్యకర్తలే కోరుకుంటున్నారు. అసలు సిసలైన వారసుడు, ప్రజానాయకుడు ఎప్పటికైనా నందమూరి యంగ్ టైగర్ అని చెబుతున్నారు అభిమానులు. ఐనా ఇవన్నీ కాదు పవన్ సీఎం పీఠంపై కూర్చోవాలనే ఆశ ఉండి ఉంటే కూటమి అధికారంలోకి వచ్చిరాగానే సీటు పంచుకోవాల్సిందే అని పట్టుబట్టేవారు.. కానీ ఏపీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసి.. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపటమే ఆయనకు కావాలి.. అందుకే ఎలాంటి డిమాండ్ పెట్టకుండా డిప్యూటీతో పాటు కొన్ని శాఖలు మాత్రమే తీసుకున్నారని మరికొందరు టీడీపీ, జనసేన అభిమానులు, కార్యకర్తలు చెప్పుకుంటున్న పరిస్థితి. ఇక వైసీపీ వీరాభిమానులు ఐతే చిత్ర విచిత్రాలుగా కామెంట్స్ చేస్తున్నారు. చంద్రబాబు తదనంతరం పగలు లోకేష్ తీసుకుంటారు.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని.. దాన్ని అప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డిని సాకుగా చూపి.. చినబాబు కింద పని చేయడానికి సైతం పవన్ సిద్ధంగా ఉంటారని వైసీపీ శ్రేణులు సెటైర్లు వేస్తున్నాయి. అయినా పవన్ బలం ఏ పాటిదో ఆయనకే బాగా తెలుసని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఇద్దరిలో గోల్డెన్ ఛాన్స్ ఎవరికి వస్తుందో.. ఏమవుతుందో వేచి చూడాలి మరి.

who Deserves the Chair after Chandrababu?:

who is the Next CM After Chandrababu Naidu?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement