Advertisementt

The GOAT: ట్రైలర్ కన్ఫ్యూజ్ చేస్తుంది కానీ?

Wed 28th Aug 2024 10:11 PM
the goat trailer  The GOAT: ట్రైలర్ కన్ఫ్యూజ్ చేస్తుంది కానీ?
Vijay Starring THE GOAT Trailer Released The GOAT: ట్రైలర్ కన్ఫ్యూజ్ చేస్తుంది కానీ?
Advertisement
Ads by CJ

దళపతి విజయ్, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ట్రైలర్ వచ్చేసింది. గాయ్స్.. థిస్ ఈజ్ న్యూ ఎసైన్మెంట్.. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. 68 సక్సెస్ ఫుల్ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్. హోస్టేజ్ నోగోషియేటర్. ఫీల్డ్ ఏజెంట్..ఏ స్పై అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన ఈ ట్రైలర్ కాస్త కన్ఫ్యూజింగ్‌గా ఉంది కానీ.. సరికొత్త కంటెంట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లుగా అయితే తెలియజేస్తోంది.

యాక్షన్ ప్యాక్డ్ పాత్రలో డిఫరెంట్ గెటప్స్‌లో విజయ్ అదరగొట్టాడు. ట్రైలర్ చివరిలో జేమ్స్ బాండ్ ట్యూన్ విజయ్ హమ్ చేయడం ఎక్సైట్మెంట్‌ని పెంచేసింది. కాకపోతే ఈ ట్రైలర్ అర్థం కావాలంటే మినిమమ్ డిగ్రీ అయినా చేసుండాలి అనేలా.. కాస్త కన్ఫ్యూజ్ చేస్తోంది. అయినా ట్రైలర్ చూసే సినిమాను జడ్జ్ కూడా చేయలేం కదా..! విజయ్, మీనాక్షి చౌదరి కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యింది. ట్రైలర్ లో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, యోగి బాబు, ప్రేమి అమరెన్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించారు.

వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే మాస్టర్. The GOAT నేరేటివ్ అద్భుతంగా ఉండబోతోందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ బ్రిలియంట్ అనిపిస్తోంది. యువన్ శంకర్ రాజా తన బీజీఎంతో యాక్షన్ ని నెక్స్ట్ లెవల్ కి ఎలివేట్ చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ క్లాస్ లో వున్నాయి. The GOAT సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీని ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను విడుదల చేయనుంది.

Vijay Starring THE GOAT Trailer Released:

The Goat Trailer Talk

Tags:   THE GOAT TRAILER
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ