Advertisementt

ఆయ్ టీమ్‌కు యంగ్ టైగర్ అభినందనలు

Sun 25th Aug 2024 06:17 PM
jr ntr,aay team  ఆయ్ టీమ్‌కు యంగ్ టైగర్ అభినందనలు
Young Tiger NTR praises on Aay team ఆయ్ టీమ్‌కు యంగ్ టైగర్ అభినందనలు
Advertisement
Ads by CJ
మ్యాడ్ మూవీ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ఆయ్ సూపర్ హిట్ తెచ్చుకుంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ బ‌జ్‌తో.. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకొని వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తోన్న‌ ఆయ్ టీమ్‌కు మ‌రో అద్భుత‌మైన ప్ర‌శంస దక్కింది. అదెవ‌రి నుంచో కాదు.. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచే..! చిత్ర యూనిట్‌ను ప్ర‌త్యేకంగా క‌లుసుకున్న టైగర్ చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఎన్టీఆర్ వంటి స్టార్ హీరో నుంచి ప్ర‌శంస‌లు ద‌క్క‌డం ఆయ్ చిత్ర యూనిట్‌లో స‌రికొత్త ఉత్సాహాన్ని ఇస్తుంద‌ని చెప్పుకోవచ్చు. సినిమాలో మంచి కంటెంట్‌ ఉండటంతో పాటు మంచి ఎంటర్ టైన్మెంట్ ఉండటంతో థియేటర్లకు జనాలు ఎగబడుతున్నారు. దీంతో ఆయ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి క‌లెక్ష‌న్స్‌ను అదరగొడుతోంది. కాగా.. తార‌క్‌ను కలిసినా వారిలో చిత్ర నిర్మాత బ‌న్నీ వాస్‌, నార్నే నితిన్‌, నిర్మాత ఎస్.కె.ఎన్, న‌య‌న్ సారిక‌, అంకిత్ కొయ్య‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి ఉన్నారు.
కాగా.. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు. ఆగస్టు 15 రిలీజ్ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల మదిని కొల్లగొట్టి.. బాక్స్ ఆఫీసును షేక్ చేస్తోంది.

Young Tiger NTR praises on Aay team:

Aay team meets Young Tiger Ntr

Tags:   JR NTR, AAY TEAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ