రీసెంట్‌గా కోల్‌కతాలో జరిగిన ఘటనపై తాజాగా సుమన్ స్పందించారు. ఇలాంటి ఘటనలు విన్నప్పుడు చాలా బాధగా ఉంటుందని, అందుకే మహిళలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని చెబుతుంటానని అన్నారు. శనివారం జనరల్ చెకప్ నిమిత్తం నిమ్స్ హాస్పిటల్‌కి వచ్చిన సుమన్.. అక్కడ వైద్యుల నిరసనపై మాట్లాడారు.
వైద్యులది పవిత్రమైన వృత్తి. ఎలాంటి విపత్కర పరిస్థితులలో అయినా వారు సేవ చేసేందుకు ముందుకు వస్తారు. కరోనా సమయంలో అయిన వాళ్లే దూరంగా ఉంటే డాక్టర్‌లు, నర్సులు ముందుండి సేవ చేసి ఎంతో మందికి ప్రాణం పోశారు. అలాంటి వారిని మనమే కాపాడుకోవాలి. కొంత మంది సపోర్టు చేయడం బాధాకరమని, మహిళల రక్షణ కోసం ఎవరున్నారు..? సొంతంగా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా అని అన్నారు.
ప్రస్తుతం సుమన్ తన వరకు వచ్చిన పాత్రలలో నటిస్తూనే ఉన్నారు. మధ్యమధ్యలో ఆయన రాజకీయాల గురించి మాట్లాడే మాటలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల గురించి ఆయన మాట్లాడారు. వారి పాలనలో ఏపీ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు.